సునందపుష్కర్ మృతి: మణికట్టుపై గల పదో గాయమే?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి మలుపులు తిరుగుతోంది. ఇటీవలి పోస్టుమార్టం నివేదికలో సునంద మణికట్టు పైన ఇంజక్షన్ గుర్తును వైద్యులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమె మృతదేహం నుండి దుర్వాసనతో కూడిన ద్రవం వెలువడినట్లు వైద్యులు చెప్పారని తెలుస్తోంది.
సునంద మృతదేపంపై వైద్యులు పలు గాయాలను గుర్తించారు. దాదాపు అన్ని గాయాలు సాధారణంగా జరిగినవేనని గుర్తించారు. అయితే, 10 గాయం విషయంలో మాత్రం అనుమానాలు తలెత్తుతున్నాయి. అది ఆమె మణికట్టు పైన ఉన్న ఇంజక్షన్ గుర్తు.
సునంద మృతదేహం పైన మొత్తం పదిహేను గాయాలను వైద్యులు గుర్తించారు. ఆమె దేహం పైన ఉన్న పన్నెండో గాయాన్ని పంటి గాయంగా గుర్తించారు.
కాగా, సునంద పుష్కర్ మృతిపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సునందది హత్య కావొచ్చునని, ప్రీ ప్లాన్డ్ హత్య కావొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
సునంద మృతదేహంపై గాయాలు ఉన్నాయన్నారు. ఆమెకు పాయిజన్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి సునంద పుష్కర్ మృతి విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం ట్వీట్ కూడా చేశారు. అయితే, స్వామి వ్యాఖ్యలను శశి థరూర్ కొట్టి పారేశారు.

సునంద పుష్కర్
కేంద్రమంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ ఇటీవలి పోస్టుమార్టం నివేదికలో సునంద మణికట్టు పైన ఇంజక్షన్ గుర్తును వైద్యులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

శశి థరూర్
సునంద పుష్కర్ మృతిపై విచారణ విషయంలో కేంద్రమంత్రి శశి థరూర్ రెండు రోజుల క్రితం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సునంద కుటుంబ సభ్యులు కూడా తనతోనే ఉన్నారని చెప్పారు.

సుబ్రహ్మణ్య స్వామి
కేంద్రమంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతిపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అనుమానం వ్యక్తం చేశారు.

సునంద, శశి థరూర్
కేంద్రమంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతదేహం పైన మొత్తం పదిహేను గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు గుర్తించారు.

పదవ గాయం
సునంద మృతదేహంపై వైద్యులు పలు గాయాలను గుర్తించారు. దాదాపు అన్ని గాయాలు సాధారణంగా జరిగినవేనని గుర్తించారు. అయితే, 10 గాయం విషయంలో మాత్రం అనుమానాలు తలెత్తుతున్నాయి. అది ఆమె మణికట్టు పైన ఉన్న ఇంజక్షన్ గుర్తు.

పంటి గాయం
సునంద మృతదేహం పైన మొత్తం పదిహేను గాయాలను వైద్యులు గుర్తించారు. ఆమె దేహం పైన ఉన్న పన్నెండో గాయాన్ని పంటి గాయంగా గుర్తించారు.












Click it and Unblock the Notifications