సునంద పుష్కర్ హత్య: కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు గురువారంనాడు ఆమె కుమారుడు శివ మీనన్‌ను ప్రశ్నించారు. మీనన్ దేశంలో లేకపోవడంతో సునంద పుష్కర్ కుమారుడు శివ మీనన్‌లు పోలీసులు ఇంత కాలం విచారించలేకపోయారు. సునంద పుష్కర్ హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటి వరకు 15 మందిని ప్రశ్నించింది.
కేసుకు సంబంధించి శివ మీనన్ కొత్త విషయాలు చెప్పగలరని భావిస్తున్నట్లు, దర్యాప్తునకు సహకరిస్తారని అనుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ అంతకు ముందు అన్నారు. శివ మీనన్ పోలీసుల విచారణకు వచ్చారని, విచారణ జరుగుతోందని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు సునంద పుష్కర్ హత్య కేసులో శశిథరూర్‌నే కాకుండా ఆయన కార్యాలయ ఉద్యోగులను, మిత్రులను విచారించారు. సమాజ్‌వాదీ మాజీ నేత అమర్ సింగ్‌ను, సీనియర్ జర్నలిస్టు నళినీ సింగ్‌ను కూడా పోలీసులు విచారించారు.
సునంద పుష్కర్ నిరుడు జనవరి 17వ తేదీ దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో మరణించారు. అంతకు ముందు రోజు ఆమె పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్‌తో మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో వివాదానికి దిగారు. ఆమెతో తన భర్త థరూర్‌కు సంబంధం ఉందనే ఆరోపణతో పుష్కర్ ఆమెతో గొడవ పెట్టుకున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications