ఎవరు, ఎందుకు?: సునంద కేసులో 'కొత్త' కోణాలు, షాకైన శశిథరూర్‌కు ఝలక్

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సునంద పుష్కర్ మృతి విషయంలో ఏడాదిగా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగిన విషయం తెలిసిందే. ఆమెది ఆత్మహత్య అని, మృతి అని, హత్య అనే వాదనలు చాలా రోజులుగా వినిపించాయి. చివరకు మంగళవారం నాడు ఢిల్లీ పోలీసులు హత్యా కేసుగా నమోదు చేయడంతో ఇది మరో కోణం తిరిగింది.

ఢిల్లీ పోలీసులు హత్యా కేసుగా నమోదు చేయడాన్ని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్వాగతించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రశ్నిస్తోంది. ఏడాది తర్వాత హత్య కేసుగా నమోదు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సునంద పుష్కర్ మృతి విషయంలో ఆత్మహత్యగా చెప్పాలని పైన ఒత్తిడి వచ్చినట్లుగా వైద్యులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే, వాటిని వైద్యులు ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

డిల్లీ పోలీసులు హత్య కేసుగా నమోదు చేయడంతో తాను ఆశ్చర్యానికి లోనయ్యానని, సునంద హత్యకు కారణం ఎవరో తెలుసుకోవాలని శశిథరూర్ చెప్పడం గమనార్హం. విచారణకు సహకరిస్తానని చెప్పారు. కాగా, సునందను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పోలోనియంగా గుర్తించారు.

Sunanda Pushkar murder: I am stunned, says Shashi Tharoor in FB post

ఈ విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఉంది. పోలోనియం అనేది అత్యంత విషపూరితమైన రేడియో ధార్మిక పదార్థం. దీనిని క్యూరీ దంపదులు 1898లో కనిపెట్టారు. గతంలో ఎవరికైనా విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష విధించవలసి వచ్చినప్పుడు దీనిని ఉపయోగించేవారు. పాలస్తీనా నాయకుడు యాసిర్ ఆరాఫత్‌ను, కేజీబీ ఏజెంటు ఒకరిని చంపేందుకు కూడా ఇదే పదార్థాన్ని వినియోగించారని అంటారు.

ఒకసారి దీనిని ఇంజెక్ట్ చేసిన తర్వాత కనుక్కోవడం చాలా కష్టమట. పౌడర్ రూపంలో కూడా దీనిని ఉపయోగించే అవకాశం ఉంటుంది. సునంద మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు శాంపిళ్లను పరీక్ష కోసం విదేశాలకు కూడా పంపించారు. అక్కడే పోలోనియం వాడిన విషయం తెలిసింది.

మరోవైపు, ఆమెది హత్యే అయితే ఇంత ఆలస్యంగా నిర్ధారించేందుకు గల కారణాలు ఏమిటనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఒత్తిళ్లు వచ్చాయా అనే చర్చ సాగుతోంది. సునంద పుష్కర్‌ను ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు, ఆ అవసరం ఎవరికి ఉంది అనే విషయాల పైన జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా... శశిథరూర్‌ను లోకసభ నుండి తొలగించాలని బీజేపీ, లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

సునంద పుష్కర్ విషం ఇవ్వడం వల్ల చనిపోయారు.

సునంద పుష్కర్‌కు విషంను ఇంజెక్ట్ చేయడం వల్ల మృతి చెందారా లేక ఓరల్‌గా ఇవ్వడం వల్ల చనిపోయారా పోలీసులు తెలుసుకోవాల్సి ఉంది.

పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి పైన సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సరోజిని నగర్ పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది.

సునంద హత్య కేసును దర్యాఫ్తు చేసేందుకు ప్రత్యేక టీంను నియమించారు. దీనిని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రేమ్ నాథ్ పర్యవేక్షిస్తారు.

సునంద మృతి పైన 15ని గాయాలు ఉన్నట్లు ఆటోస్పైలో తెలిసింది.

శశిథరూర్‌ను కూడా ప్రశ్నించే అవకాశముంది.

జనవరి 17న ఢిల్లీ నుండి దుబాయ్, పాకిస్తాన్‌లకు ఎవరు ప్రయాణించారో పోలీసులు కోరనున్నారు. ప్రయాణీకుల లిస్ట్ వారు అడగనున్నారు.

సునంద పుష్కర్ మృతికి ముందు ఆమె, తన భర్త శశిథరూర్‌తో కలిసి జాయింట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ట్విట్టర్ అకౌంటులో గుర్తు తెలియని వ్యక్తుల ట్వీట్స్ వల్ల ఇబ్బంది పడ్డామని, తమ వివాహ జీవితం ఆనందంగా ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+