సునంద కేసు: శశి లేక బతకనని పాక్ జర్నలిస్ట్, రొమాంటిక్ మెసేజ్
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం పోలీసులు అన్ని కోణాల్లోను దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు చీఫ్ బీఎస్ బస్సీ సోమవారం తెలిపారు. శశిథరూర్‌ను ప్రశ్నించే విషయమై ఇంకా నిర్ణయించలేదన్నారు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, త్వరలో ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఈ వారంలో థరూర్‌ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.
మెహర్ తరర్ ఎఫైర్ గురించి నళిని...
పోలీసులు గతంలో నిళిని సింగ్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. మృతికి కొన్ని గంటల ముందు నళినితో సునంద పుష్కర్ మాట్లాడారు. ఆ సమయంలో తనతో ఆమె అనేక విషయాలు చెప్పిందని ఆమె పోలీసులకు చెప్పినట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. శశిథరూర్ మూడు రోజుల పాటు దుబాయ్‌లో తరర్‌తో ఉన్నారని చెప్పిందన్నారు.
శశిథరూర్ లేకుండా తాను బతకలేనని పాక్ జర్నలిస్ట్ తరర్ చెప్పినట్లుగా సునంత పేర్కొందన్నారు. ఈ వాంగ్మూలం నేపథ్యంలో వారు గత ఆధారాలను పరిశీలిస్తున్నారు. మెహర్ తరర్‌తో శశిథరూర్ మూడు రోజులు దుబాయ్‌లో ఉన్నారనే సమయంలో థరూర్ కేంద్రమంత్రిగా ఉన్నారు.

గీతా సింగ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో... సునంద పుష్కర్ తనకు మూడు నాలుగేళ్లుగా తెలుసు. మృతికి ఏడాది ముందు నుండి తన ప్రయివేటు లైఫ్ గురించి ఆమె తనతో చెప్పారు. ముఖ్యంగా శశిథరూర్‌తో తన సంబంధం గురించి తెలిపారు. ఆరేడు నెలల క్రితం సునంద తనతో తన బాధను పంచుకున్నారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ తరర్‌తో థరూర్ రొమాంటిక్ ఇంటరెస్ట్ పైన చెప్పారు.
జూన్ 2013లో తరర్, థరూర్‌లో దుబాయ్‌లో మూడు రోజులు గడిపారని తనకు తెలుసునని సునంద చెప్పారు. దుబాయ్‌లో సునందకు మంచి పరిచయాల నేపథ్యంలో అది తెలిసింది. ఆమె స్నేహితులు ఆమెకు ఈ విషయం చెప్పారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని సునంద చెప్పారు. మృతికి గంటల ముందు సునంద తనకు ఫోన్ చేశారు. తరర్, థరూర్‌లో పరస్పరం రొమాంటింక్ సందేశాలు పంపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ సందేశంలో.. సార్వత్రిక ఎన్నికల అనంతరం సునందకు థరూర్ విడాకులు ఇచ్చే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ఉంది. మెహర్ తరర్‌ను పెళ్లి చేసుకునేందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు.
అంతేకాకుండా, థరూర్ లేకుండా తాను జీవించలేనని తరర్ పేర్కొన్నారు. అంతేకాకుండా థరూర్ కుటుంబ సభ్యులు కూడా ఈ అపైర్‌ను తప్పుపట్టలేదు. అంతేకాకుండా, ఐపీఎల్ విషయమై కూడా పేర్కొన్నారు. ఆరోగ్యం బాగా లేనప్పుడు థరూర్ ఆమెను ఆసుపత్రికి లేదా వైద్యుడి వద్దకు ఎప్పుడు తీసుకు వెళ్లలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications