పాక్ జర్నలిస్ట్‌తో థరూర్ 3రాత్రులు? సునంద అప్‌సెట్, మాట్లాడనని తరర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌తో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మూడు రాత్రుళ్లు గడిపారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. థరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి విషయమై రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది.
తాజాగా భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ట్వీట్ చేశారు. థరూర్ మూడు రాత్రుళ్లు గడిపారని ఆయన ఆరోపించారు. థరూర్ దుబాయ్‌లో తరర్‌తో మూడు రోజులు ఉన్నాడని అంటున్నారు.

తరర్‌తో థరూర్ సంబంధాలపై సునంద అప్‌సెట్
పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌తో తన భర్త శశిథరూర్ సంబంధాల పైన మృతి చెందిన సునంద పుష్కర్ అప్ సెట్ అయ్యారని అంటున్నారు. పోలీసుల విచారణలో సాక్ష్యులు ఈ విషయం చెప్పారని తెలుస్తోంది.
దుబాయ్‌లో థరూర్‌తో మూడు రోజులు ఉన్నారనే ప్రచారం పైన మెహర్ తరర్ కూడా స్పందించారు. ఈ విషయమై తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. తనను పోలీసులు పిలిచి విచారిస్తే హాజరవుతానని చెప్పారు. అందుకోసం తాను నిరీక్షిస్తున్నానని తెలిపారు. తాను పోలీసుల విచారణకు సహకరించేందుకు సదా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దుబాయ్‌లో ఓ వేడుక కోసం తాను వెళ్లానని, తనతో పాటు చాలామంది వచ్చారని తెలిపారు.












Click it and Unblock the Notifications