ఎన్సీపీకి కొత్త అధినేత..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న రాజకీయ ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్.. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- బీజేపీ కూటమి ప్రభుత్వానికి జైకొట్టారు. షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనతో పాటు తొమ్మిది మంది ఎన్సీపీ శాసన సభ్యులు- హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వల్సే పాటిల్, ధనంజయ్ ముండే, ఆదితి టత్కరే, సంజయ్ బాబురావ్ బన్సొడే, అనిల్‌భాయ్ దాస్ పాటిల్, ఆత్రమ్ ధర్మారావ్ బాబా భగవంత్ రావ్.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఈ మధ్యాహ్నం గవర్నర్ రమేష్ బైస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

అసలైన ఎన్సీపీ తమదేనంటూ తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని పేర్కొన్నారు. ఎన్సీపీ నాయకులు గానే తాము షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని, పార్టీలో చీలిక తీసుకొచ్చామనడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. ఎన్సీపీ పేరు, ఎన్నికల గుర్తుతోనే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని పునరుద్ఘాటించారు.
అసలైన ఎన్సీపీ తమది కావడం వల్ల పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్టామని ప్రఫుల్ పటేల్ వివరించారు. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా సునీల్ టత్కరేను అపాయింట్ చేసినట్లు ప్రకటించారు. పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పగిస్తున్నట్లు వివరించారు. పార్టీలో ఎలాంటి చర్యలనైనా తీసుకునే అధికారం ఆయనకు కట్టబెట్టామని అన్నారు. పార్టీ చీఫ్ విప్‌గా మంత్రి అనిల్ భైదాస్ పాటిల్‌ను అపాయింట్ అయ్యారు.

తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం పట్ల సునీల్ టత్కరే హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గాల వరకు తన నాయకత్వాన్ని పార్టీ శ్రేణులు స్వాగతిస్తోన్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని, ఎమ్మెల్యేలతో సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగుతున్నారని అజిత్ పవార్ గుర్తు చేశారు. అందుకే మహారాష్ట్ర వరకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సునీల్ టత్కరేను అపాయింట్ చేశామని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పార్టీకి జాతీయ అధ్యక్షుడిని ప్రస్తుతానికి ప్రకటించట్లేదని, మున్ముందు ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications