సమస్యల్లో సన్నీడియోల్..! అనర్హత వేటు తప్పదా...?
పంజాబ్/హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌పై అనర్హత వేటు తప్పదా..? ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు.
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో బీజేపీ పాగా వేసింది. దాదాపు 80వేల ఓట్ల మెజార్టీతో సన్నీ విజయం సాధించారు. అయితే.. ఆయన ఎన్నికల ఖర్చు విషయంలో పరిమితి దాటరన్న విమర్శలు వచ్చాయి. ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఖర్చు 70 లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే.. సన్నీ డియోల్ మొత్తంగా 86 లక్షలు ఖర్చు చేశారని ఎన్నికల అధికారులు తేల్చారు.దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నీ డియోల్‌కు నోటీసులు జారీ చేసింది. పరిమితికి మించి ఖర్చు చేసి గెలుపొందిన అభ్యర్థి ఎంపీగా ఎన్నికైతే అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.

ప్రస్తుతం ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు సన్నీ వివరణ ఇస్తారు. ఆయన వివరణతో సంతృప్తి చెందని పక్షంలో ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తారు. అయితే.. అనర్హత పడితే మళ్లీ ఉప ఎన్నికలు ఉండదు. రెండో స్థానంలో నిలిచిన వ్యక్తిని విజేతగా ప్రకటించడం జరగుతుంది. ప్రస్తుతం సన్నీపై అనర్హత వేటు పడితే.. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ చీఫ్ సునీల్‌కుమార్ జఖర్ విజేతగా ప్రకటించడం ఖాయం.
అదే జరిగితే బీజేపీకి పంజాబ్‌లో పెద్ద దెబ్బ పడినట్లే అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాయబరేలీ, అమేథీ ఎలా కంచుకోటలుగా ఉన్నాయో.. గురుదాస్‌పూర్ కూడా ఒక కంచుకోట. ఈసారి దాన్ని బద్దలుకొట్టి బీజేపీ పాగా వేసింది. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న సన్నీడియోల్‌పై అనర్హత వేటు పడితే కాంగ్రెస్ మరోసారి ఇక్కడ విజయం సాధించినట్లు అవుతుంది. మరి ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..!!
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!












Click it and Unblock the Notifications