Super wife: సార్ నా భర్త బాహుబలి కాదు కట్టప్ప, మోసం జరిగింది, చూడమ్మ ఇవన్నీ మామూలే!
ముంబాయి/ మీరా: పెద్దలు కుదిర్చిన పెళ్లి నెల క్రితం ఢాంఢాం అని జరిగింది. నెల రోజులు భర్తతో కాపురం చేసిన భార్య తన భర్త బాహుబలి అంటూ మురిసిపోయింది. అయితే ఇటీవల తన భర్త బాహుబలి కాదని, అదే సినిమాలో కట్టప్ప అంటూ షాక్ కు గురైయ్యింది. తన భర్త ఇన్ని రోజులు తలకు విగ్ పెట్టుకుని తనను మోసం చేశాడని, అతనికి బట్టతల ఉందని, తనకు అన్యాయం జరిగిందని భార్య పోలీసు కేసు పెట్టింది. అదనపు కట్నం కోసం తన అత్తమామలు తనను మోసం చేశారని, తనకు అన్యాయం జరిగిందని, తన మీద అనుమానంతో తన భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇలా ఏ సెక్షన్ లు ఉంటే ఆ సెక్షన్ ల కింద కేసులు నమోదు చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయించింది. చూడామ్మ ఇప్పుడు బట్టతలలు కామన్ అంటూ భార్యకు పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. భార్య ఫిర్యాదులతో షాక్ కు గరైన భర్త ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. నువ్వు వెంటనే మా ముందు లొంగిపోవాలని భర్తకు పోలీసులు సూచించారు.

నెల క్రితం గ్రాండ్ గా పెళ్లి
ముంబాయిలో నగరంలోని మీరా రోడ్డులో నివాసం ఉంటున్న 29 ఏళ్ల రామ్ పాల్, 27 ఏళ్ల కాజల్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది)ల వివాహం గత నెలలో జరిగింది. కరోనా వైరస్ నియమాలు పాటిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు సమక్షంలో పెళ్లి గ్రాండ్ గానే జరిగింది. పెళ్లి సమయంలో కాజల్ కుటుంబ సభ్యులు రామ్ పాల్ కు భారీ మొత్తంలో కట్నకానుకలు సమర్పించారని తెలిసింది.

అనుకోకుండా భార్య బాత్ రూమ్ లోకి ఎంట్రీ
భర్త రామ్ పాల్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కాజల్ చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నది. భార్య కాజల్ ఐదు రోజుల క్రితం భర్త స్నానం చేస్తుంటే అనుకోకుండా బాత్ రూమ్ లోకి వెళ్లింది. ఆ సమయంలో భర్త రామ్ పాల్ ను చూసిన భార్య కాజల్ షాక్ కు గురైయ్యింది. భర్త రామ్ పాల్ కు బట్టతల ఉందని, ఇన్ని రోజులు విగ్ పెట్టుకుని తనను మోసం చేశాడని గుర్తించిన కాజల్ కు చిర్రెత్తిపోయింది.

సార్..... మీరే న్యాయం చెయ్యాలి అంతే
తన భర్త విగ్ పెట్టుకుని బాహుబలి టైప్ లో తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, తన భర్త రామ్ పాల్ కు కట్టప్ప టైపులో బట్టతల ఉన్న విషయం తన అత్తమామలు నా దగ్గర దాచిపెట్టారని ఆరోపిస్తూ కాజల్ ముంబాయి సిటీలోని నయానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. బట్టతల ఉన్న రామ్ పాల్ తనను మోసం చేసి పెళ్లి చేసుకుని తనను మోసం చేసి తన జీవితాన్ని నిలువునా నాశనం చేశాడని కాజల్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు బిత్తరపోయారు.

చూడమ్మా.... ఇవన్నీ కామన్
ప్రస్తుతం సమాజంలో చాల మందికి బట్టతలలు ఉన్నాయని, ఎలాగో పెళ్లి జరిగిపోయింది సర్దుకుపోవాలని పోలీసులు భార్య కాజల్ కు నచ్చచెప్పడానికి ప్రయత్నించారని తెలిసింది. అయితే తన భర్తకు చాలా వరకు తల మీద వెంట్రకులు లేవని, అతని తల చూస్తే ఎయిర్ పోర్టు గుర్తుకు వస్తోందని, అతనితో తాను కాపురం చెయ్యలేనని, తన స్నేహితులు అందరూ అందంగా, తల వెంట్రుకలు బాగా ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకున్నారని, తాను మోసపోయానని, తనకు న్యాయం చెయ్యాలని కాజల్ పోలీసులను ఆశ్రయించింది.

ఏదో అనుకుంటే...... లేనిపోని కేసులు
బట్టతల ఉన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకున్న రామ్ పాల్ అతని కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు. తన భర్త రామ్ పాల్ తన శీలంపై అనుమానంతో తన ఫోన్ ను హ్యాక్ చేసి కాల్ రికార్డు చేస్తున్నాడని, తాను సోషల్ మీడియాలో ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నాను అంటూ మొబైల్ ఫోన్ చెక్ చేస్తూ తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని, అదనపు కట్నం కోసం తన అత్తమామలు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ భార్య కాజల్ నయానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదో మాయ చేసి పెళ్లి చేసుకున్న భర్త రామ్ పాల్ ఇప్పుడు భార్య కాజల్ దెబ్బతో ముంబాయిలో ని థాన్ కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

నాయనా నువ్వు లొంగిపోరా
భర్త రామ్ పాల్ మీద చిత్రహింసలు, వరకట్నం వేధింపుల ఆరోపణలు రావడంతో నాయనా నువ్వు వెంటనే మా ముందు లొంగిపో, లేదంటే నీకే సమస్యలు వస్తాయి అంటూ నయానగర్ పోలీసులు అతనికి సూచించారు. మొత్తం మీద బట్టతల ఉన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకున్న చార్టెడ్ అకౌంటెంట్ ఫ్యామిలీకి ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైనాయని వెలుగు చూడటంతో అతని బంధువులు, స్నేహితులు షాక్ అయ్యారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications