మెడికల్ వండర్ : ఒకే సారి సెక్స్.. 10రోజుల్లో రెండోసారి గర్భం..
బ్రిస్బేన్ : పదిరోజుల వ్యవధిలోనే కేట్ హిల్ అనే ఓ మహిళ రెండోసారి గర్బం దాల్చిన ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటు చేసుకుంది. వైద్య చరిత్రలో ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.
భర్తతో ఒకేసారి శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. పదిరోజుల పాటు పురుషుడి వీర్యం క్రియాశీలకంగా ఉండే అవకాశంతో పాటు మహిళా అండాశయం నుంచి వెంటవెంటనే అండాలు విడుదలవడంతో.. కేట్ హిల్ రెండు సార్లు గర్భవతి అయినట్టుగా నిర్దారించారు వైద్యులు. సూపర్ ఫెటేషన్(ఒకేసారి రెండు అండాలు గర్భంలోకి చేరడం) గా పరిగణించే అరుదైన ప్రక్రియ వల్లే ఇలా రెండుసార్లు గర్భం దాల్చే పరిస్థితి ఏర్పడుతుందని వారు చెబుతున్నారు.

పోలిసైస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ కారణంగా 2006నుంచి కేట్ హిల్ హార్మోన్ ట్రీట్ మెంట్ తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె రెండుసార్లు గర్భం దాల్చింది. కాగా, ఇటీవలే ఇద్దరు పిల్లలకు ఒకే రోజు జన్మనిచ్చింది కేట్ హిల్. అయితే వీరిద్దరు కవలలు కాదు. బరువులోను, పోలికలోను ఇద్దరు భిన్నంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కేవలం పదివరకే చోటు చేసుకున్నాయని వైద్యులు చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications