బెంగళూరు జైల్లో శశికళ, దర్జాగా షాపింగ్, దెబ్బతో ఐపీఎస్ అధికారిపై వేటు !
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజ్ విషయం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజ్ విషయం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని వెలుగు చూడటంతో నెల క్రితం సిద్దరామయ్య ప్రభుత్వం ఉలిక్కిపడింది.
ఇప్పుడు శశికళ తన వదిన ఇళవరసితో కలిసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి షాపింగ్ చేసి వెళ్లారని ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఇరుకునపడింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారుల మీద వేటు పడింది.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరెండెంట్, సీనియర్ ఐపీఎస్ అధికారి నిఖమ్ ప్రకాష్ అమ్రిత్ ను కర్ణాటక రిజర్వ్ పోలీసు శాఖకు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శశికళ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారని వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరెండెంట్ నిఖమ్ ప్రకాష్ అమ్రిత్ మీద వేటు వేసింది.
శశికళ దెబ్బతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉద్యోగం చేస్తున్న అధికారులు ఎప్పుడు ఏమీ జరుగుతుందో అంటూ హడలిపోతున్నారు. శశికళ వ్యవహారంపై ఇప్పటికే రిటైడ్ ఐఏఎస్ అధికారి ఆధ్వరంలో విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఏసీబీ అధికారులు సైతం శశికళ వ్యవహారంపై విచారణ ముమ్మరం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications