Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నటిని రేప్ చేయి, రూ 3 కోట్లు ఇస్తా: పల్సర్ సునీకి హీరో దిలీప్ ఆఫర్

సంచలనం సృష్టించిన మాలీవుడ్‌ నటి కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

తిరువనంతపురం: సంచలనం సృష్టించిన మాలీవుడ్‌ నటి కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నటిపై అత్యాచారం చేస్తే రూ.3 కోట్లు ఇస్తానని హీరో దిలీప్ నిందితులకు ఆఫర్ చేసినట్లుపోలీసులు కేరళ హైకోర్టుకు తెలిపారు.

రేప్‌ చేస్తే కోటిన్నర ఇస్తానని, పొరపాటున పట్టుబడితే మరో కోటిన్నర ఇస్తానని దిలీప్‌ నిందితుడు పల్సర్‌ సునీల్‌తో ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరిలో అత్యాచారయత్నం జరగ్గా జూలైలో దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నలుగురు యువకులు ఆమె వాహనంలోకి చొరబడి రెండు గంటలపాటు నడుస్తున్న వాహనంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఇప్పటికి రెండుసార్లు దిలీప్‌ బెయిలు దరఖాస్తును కిందికోర్టు తోసిపుచ్చగా, మూడోసారి హైకోర్టును ఆశ్రయించాడు

పట్టుబడితే ఇంత....

పట్టుబడితే ఇంత....

నటిపై లైంగిక దాడి చేస్తే కోటిన్నర రూపాయలు ఇస్తానని, ఒక వేళ పట్టుబడితే రెండింతలు అంటే రూ. 3 కోట్లు ఇస్తానని దిలీప్ పల్సర్ సునీతో ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మలయాళీ నటిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో లైంగిక దాడికి యత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో 49 ఏళ్ల హీరో దిలీప్‌ను పోలీసులు జులైలో అరెస్టు చేశారు.

Recommended Video

    Actress Abduction; Pulsar Suni Involvement Reveals | Oneindia Telugu
    సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా....

    సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా....

    దిలీప్ నటిస్తున్న సినిమాలోనే ఆ మలయాళీ నటి ఓ పాత్ర పోషిస్తోంది. ఆ సినిమా షూటింగ్‌కు త్రిషూర్ నుంచి కొచ్చి వెళ్తుండగా నిందితులు బలవంతంగా ఆమె కారును అడ్డగించి, ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు. కనీసం నలుగురు ఆ దాడికి పాల్పడుతూ మొబైల్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

    మూడోసారి బెయిల్ పిటిషన్‌పై

    మూడోసారి బెయిల్ పిటిషన్‌పై

    దిలీప్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌‌పై మూడోసారి విచారణ జరుగుతోంది. కింది కోర్టు రెండుసార్లు ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. పాపులర్ సింగర్, టీవి ఆర్టిస్టు రిమీ టోమీ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయడానికి కోర్డు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది.

    సునీ ఎవరో తెలియదంటున్న దిలీప్...

    సునీ ఎవరో తెలియదంటున్న దిలీప్...

    పల్సర్ సునీ ఎవరో తెలియదని దిలీప్ పదే పదే చెబుతున్నాడు. కానీ పల్సర్ సునీతో దిలీప్‌నకు సంబంధం ఉందనే సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు అంటున్నారు. వ్యక్తిగత కక్షతో మలయాళీ నటిపై దిలీప్ దాడి చేయించడానే ఆరోపణలు ఉన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+