ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్: సూపర్ స్టార్ కు కోపం, మెడపట్టి గెంటేయండి !

హద్దు మీరి ప్రవర్తించే అభిమానులను వెంటనే సంఘం నుంచి బయటకు పంపించాలని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమాన సంఘాల నాయకులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

చెన్నై: హద్దు మీరి ప్రవర్తించే అభిమానులను వెంటనే సంఘం నుంచి బయటకు పంపించాలని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమాన సంఘాల నాయకులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన పేరు ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా ప్రవర్థిస్తే చూస్తూ ఊరుకోనని రజనీకాంత్ తన అభిమాన సంఘాలను నేరుగా హెచ్చరించారు.

అయితే ఎలాంటి ఉదాహరణలు చెప్పకుండా గురువారం ఒక్క సారిగా రజనీకాంత్ ఇలాంటి హెచ్చరికలు జారీ చెయ్యడంతో ఆయన అభిమాన సంఘాల నాయకులు హడలిపోయారు. ఎందుకు రజనీ సర్ ఇలా రియాక్ట్ అయ్యారు అంటూ ఇప్పుడు భారీ ఎత్తున చర్చ మొదలైయ్యింది.

క్లూ ఇచ్చిన రజనీకాంత్ !

క్లూ ఇచ్చిన రజనీకాంత్ !

ఇటీవల రజనీకాంత్ తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలో సమావేశం అయ్యారు. తాను రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అని అభిమానులతో చర్చించారు. అదే సందర్బంలో సీనియర్ అభిమాన సంఘాల నాయకులకు ఓ చిన్న క్లూ కూడా ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు

రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన చిన్న క్లూను ఆసరాగా చేసుకుని ఆయన అభిమాన సంఘాల నాయకులు చెన్నై నగరంతో సహ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేశారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై విమర్శలు చేస్తున్న నాయకులను ఎండగడుతూ వారికి విరుద్దంగా ఫెక్సీలు ఏర్పాటు చేశారు.

రజనీని వ్యతిరేకిస్తున్న ఫ్యాన్స్ !

రజనీని వ్యతిరేకిస్తున్న ఫ్యాన్స్ !

రజనీకాంత్ అభిమాన సంఘాల్లోని కొందరు నాయకులు ఆయన రాజకీయాల్లోకి రాకూడదని కోరుకుంటున్నారు. రాజనీకాంత్ రాజకీయ రంగప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ స్వయంగా ఆయన అభిమాన సంఘాల నాయకులు కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఎవ్వరికీ సాధ్యం కాలేదని చెప్పిన రజనీకాంత్ !

ఎవ్వరికీ సాధ్యం కాలేదని చెప్పిన రజనీకాంత్ !

తమిళనాడు ప్రజల కష్టాలు తీర్చడం ఏ రాజకీయ పార్టీ నాయకుడికి సాధ్యం కాలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల ఉద్దేశించి మాట్లాడారు. తమిళనాడులో రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలని అన్నారు. రజనీకాంత్ మాటలు ఎలా అర్థం చేసుకున్నారో ? ఏమో ? ఎంకే. స్టాలిన్, అన్బుమణి రాందాస్ కు వ్యతిరేకంగా కొన్ని చోట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

రజనీకాంత్ చెవిలో పడింది

రజనీకాంత్ చెవిలో పడింది

పలు రాజకీయ పార్టీల నాయకులకు వ్యతిరేకంగా తన అభిమాన సంఘాల నాయకులు పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుసుకున్న రజనీకాంత్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రాజకీయ రంగప్రవేశం విషయంలో తన నిర్ణయం బహిరంగంగా చెప్పకముందే ఏమిటి ఈ వివాదాలు ? అంటూ ఆయన మండిపడ్డారని తెలిసింది.

మెడపట్టి బయటకు గెంటేయండి !

మెడపట్టి బయటకు గెంటేయండి !

తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా, అభిమాన సంఘం పేరు ప్రతిష్టలు దెబ్బ తినే విధంగా ఎవరైనా ప్రవర్థిస్తే ఎలాంటి మొహమాటం లేకుండా బయటకు పంపించాలని ఆల్ ఇండియా రజనీకాంత్ అభిమానుల క్షేమాభివృద్ది సంఘం సీనియర్ నాయకుడు వీఎం. సుధాకర్ కు రజనీకాంత్ సూచించారు.

సూపర్ స్టార్ సీరియస్ అయ్యారంటే !

సూపర్ స్టార్ సీరియస్ అయ్యారంటే !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం ఒక్క సారిగా సీరియస్ కావడంతో కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఏమిటి ? అని కొందరు సీనియర్ అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టర్లు వెయ్యడంతో సూపర్ స్టార్ సీరియస్ అయ్యారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+