వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ, బీజేపీకి ఝలక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్: మెర్సల్ సినిమా సూపర్, జీఎస్ టీ !

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన తమిళ మెర్సల్ సినిమాను సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన తమిళ మెర్సల్ సినిమాను సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకున్నారు. మెర్సల్ సినిమా చాల బాగుందని, ఇలాంటి సినిమా ను విమర్శించడం సరికాదని ప్రముఖ నటుడు రజనీకాంత్ ట్వీట్ చేశారు.

Recommended Video

PM Modi Celebrates Diwali With Jawans సైనికులతో మోదీ దీపావళి | Oneindia Telugu

మెర్సల్ సినిమాలో జీఎస్ టీ, డిజిటల్ ఇండియా స్కీమ్ లను విమర్శించారని తమిళనాడు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జీఎస్ టీ, డిజిటల్ ఇండియాను విమర్శించిన దృశ్యాలను వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మెర్సల్ సినిమా యూనిట్ సభ్యులు, బీజేపీ నాయకుల మధ్య ఇదే గొడవ జరుగుతుంది.

Superstar Rajinikanth says Mersal has addressed important issue

మెర్సల్ సినిమాకు ప్రముఖ నటుడు కమల్ హాసన్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గగాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్, కబాలి సినిమా దర్శకుడు పా. రంజిత్, ప్రముఖ కెమెరామెన్ పీసీ. శ్రీరామ్, కుషుబు తదితరులు మద్దతు తెలిపారు.

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇంత కాలం మోనంగా ఉన్నారు. బీజేపీకి రజనీకాంత్ మద్దతు ఇస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయన ఆ పార్టీ నేతలకు పెద్ద షాక్ ఇచ్చారు. మెర్సల్ సినిమా ప్రజలకు ఎంతో ఉపయోగ పడుంతుందనే రీతిలో స్పంధించారు.

మెర్సల్ సినిమా చాలా బాగుందని, ఇలాంటి సినిమా తీసిన యూనిట్ సభ్యులకు అభినందనలు అంటూ ట్వీట్ చేసి బీజేపీ నేతలకు పెద్ద షాక్ ఇచ్చారు. త్వరలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, ఆయన బీజేపీకి మద్దతు ఇస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో రజనీకాంత్ ఆ పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు.

English summary
Tamil superstar Rajinikanth on Sunday lauded the crew of actor Vijay's starrer Mersal, saying the film has addressed an important issue. However in a terse Twitter message.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X