రజనీకాంత్ రాజకీయాల్లో ఎప్పుడు వస్తారు ?, మళ్లీ ట్విస్ట్, కమల్ దూకుడు, అదే కారణం!

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. సినీరంగంలో ఇంతకాలం సాటి నటుడు కమల్ హాసన్ తో పోటీ పడిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు రాజకీయాల్లో పోటీ పడటానికి సిద్దం అయ్యారు. అయితే రజనీకాంత్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు, కమల్ దూకుడుకు ఎప్పుడు చెక్ పెడతారు అంటూ ఆయన అభిమానులు అయోమయంలో పడిపోయారు.

Recommended Video

    Rajinikanth And Kamal Hassan's Secret Meeting
    రజనీకాంత్ ప్రకటన

    రజనీకాంత్ ప్రకటన

    చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో డిసెంబర్ చివరివారంలో దాదాపు వారం రోజుల పాటు తన అభిమాలతో ఫోటోలు దిగిన సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడులోని అనేక సమస్యలపైన స్పంధించారు. చివరి రోజు అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన రజనీకాంత్ తాను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు.

    ఎదురుదాడి

    ఎదురుదాడి

    కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ప్రజలకు ఏమి సేవ చేస్తారని తమిళర్ మక్కల్ కచ్చి పార్టీ నేత, ప్రముఖ దర్శకుడు సీమాన్, భారతీరాజతో సహ అనేక మంది సూపర్ స్టార్ మీద ఎదురుదాడికి దిగారు. అయితే సూపర్ స్టార్ మీద ఆరోపణలు చేసిన వారికి ఆయన అభిమానులు గట్టిగానే సమాధానం ఇచ్చారు.

    కమల్ హాసన్ దూకుడు

    కమల్ హాసన్ దూకుడు

    హీరో కమల్ హాసన్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ఒక్క అడుగు ముందుకు వేశారు. శనివారం చెన్నైలోని ఆళ్వార్ పేటలోని కార్యాలయంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

     కమల్ కు పోటీగా రజనీ

    కమల్ కు పోటీగా రజనీ

    చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం తన అభిమానులతో భేటీ అయ్యి చర్చిస్తున్నారు. ఈ సందర్బంగా రజనీకాంత్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ మన పార్టీ బలం పెరిగినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని, అందుకు సమయం పడుతోందని అన్నారు.

    రజనీ గ్రీన్ సిగ్నల్

    రజనీ గ్రీన్ సిగ్నల్

    ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న రోబో 2, కాలా సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. ఆ రెండు సినిమాలు విడుదల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు సమయం కేటాయిస్తారని ఆయన అభిమానులు భావించారు. అయితే రజనీకాంత్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    రోబో నిర్మాతలు

    రోబో నిర్మాతలు

    రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో నటించిన రోబో సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇప్పుడు సన్ పిక్చర్స్ కు మరో సినిమా చెయ్యడానికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రజనీకాంత్ నటించే ఈ సినిమాకు వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు.

     అధికారికంగా ప్రకటన

    అధికారికంగా ప్రకటన

    రోబో 2, కాలా సినిమాల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే సినిమా ఇదే అంటూ సన్ పిక్చర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. కొత్త పార్టీ బలంగా ఉండాలని, అప్పుడే ప్రత్యక్ష రాజకీయాలు అంటూ రజనీకాంత్ చెబుతున్న మాట కొత్త సినిమా కోసమే అని, కాదు లక్షలాది మంది కార్యకర్తలకు సభ్యత్వం ఇవ్వాడానికే అంటూట ఆయన అభిమానులు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+