వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్‌కు చికిత్స చేసిన డాక్టర్‌పై మజ్లిస్ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం..బూతులు: అరెస్టు

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి వందలాది మంది అల్లాడుతున్న పేషెంట్లకు రేయింబవళ్లు డాక్టర్లు వైద్య చికిత్సలను అందిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారిని దేవుళ్లుగా అభివర్ణిస్తున్నారు ప్రజలు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారిని అభినందించాల్సిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు డాక్టర్లపై దాడికి పాల్పడటం, వారిపౌ దౌర్జన్యానికి దిగడం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) శాసనసభ్యుడు ముఫ్తీ మహ్మద్ ఇస్మాయిల్ అనుచరులు స్థానికంగా ఓ డాక్టర్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. బూతులతో విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మాలేగావ్ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముఫ్తీ మహ్మద్ ఇస్మాయిల్ అనుచరులు, కార్పొరేటర్లు.. ఓ డాక్టర్‌పై అనుచితంగా ప్రవర్తించారు.

supporters of AIMIM MLA Mufti Ismail abused a doctor at Malegaon General Hospital in Nashik

కరోనా వైరస్‌కు చికిత్స చేస్తోన్న తమ అనుచరుల కుటుంబీకులను వెంటనే డిశ్చార్జి చేయాలంటూ వారు పట్టుబట్టగా.. దానికి డాక్టర్ కిశోర్ డాంగే నిరాకరించారు. నిబంధనల ప్రకారం.. 14 రోజుల తరువాత తాము డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము నిబంధనను ఉల్లంఘించబోమని స్పష్టం చేశారు. దీనితో మజ్లిస్ ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగారు. డాక్టర్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. దుర్భాషలాడారు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. దౌర్జన్యానికి పాల్పడటం, డాక్టర్ కిశోర్ డాంగేను దుర్భాషలాడటంతో.. ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించారు. అనంతరం వారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్య సిబ్బంది ఫిర్యాదు మేరకు మాలేగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అనుచరులను అరెస్టు చేశారు.'

English summary
Amid the Coronavirus Outbreak, the entire staff of Malegaon General Hospital Wednesday stopped work after alleged altercation with Malegaon Central MLA Mufti Mohammad Ismail of All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X