Sai Baba: సుప్రీంలో సాయి బాబాకు ఎదురుదెబ్బ.. కేసును మళ్లీ విచారించాలన్న న్యాయస్థానం..
మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా(Sai Baba)ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎమ్ ఆర్ షా, సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సాయిబాబా అప్పీల్‌ను విచారించిన బెంచ్ కాకుండా మరో బెంచ్ విచారించాలని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది.
2014లో అరెస్టయిన సాయిబాబాను గడ్చిరోలి కోర్టు దోషిగా తేల్చింది. దీనిపై సాయిబా బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఎనిమిదేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన సాయి బాబాను బాంబే హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 14ననిర్దోషిగా ప్రకటించి జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టుల తీర్పు ప్రకారం దోషులుగా నిర్థారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని సుప్రీం అభిప్రాయపడింది.

సుప్రీం కోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ అభికల్ప్ ప్రతాప్ సింగ్, సాయిబాబా తరఫున సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ సుప్రీం కోర్టులో వాదించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా హైకోర్టు అభ్యంతరకరమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో జీఎన్ సాయిబాబాతో పాటు జీవిత ఖైదు పడిన మహేష్ కరీమాన్ టిర్కి, పాండు పోరా నరోటే (ఇద్దరు రైతులు), హేమ్ కేశవదత్త మిశ్రా (విద్యార్థి), ప్రశాంత్ సాంగ్లికర్ (జర్నలిస్ట్), విజయ్ తిర్కీ (కూలీ)లను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
వీరికి గడ్చిరోలి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో నరోటే మరణించారు.జీఎన్ సాయి బాబా ప్రస్తుతం శారీరక వైకల్యం వల్ల వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. అయితే కేసును మళ్లీ విచారించడం వల్ల ఏమవుతుందోనని సాయి బాబా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications