ఎన్నికల టైమ్ లో ఎఫెక్ట్, ముస్లీం రిజర్వేషన్ల రద్దు కేసు, వాయిదా వేసిన సుప్రీం కోర్టు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ముస్లీంలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను ఆ రాష్ట్రంలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం రద్దు చేసింది. ముస్లీంలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను లింగాయత్ కు రెండు శాతం. ఒక్కలిగ కులస్తులకు రెండు శాతం కేటాయిస్తూ బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కర్ణాటకలో ముస్లీంలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం రద్దు చెయ్యడాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 13వ తేదీన సుప్రీం కోర్టులో ముస్లీం రిజర్వేషన్ల మీద దాఖలు అయిన పిటిషన్ విచారణ జరిగింది. ఆ సందర్బంలో కర్ణాటక ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్ల రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఏ ఉద్దేశంతో, ఏ ప్రతిపాదనతో ముస్లీంల రిజర్వేషన్లు రద్దు చేశారు అని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సోమవారం లోపు మీ అభిప్రాయాలను అఫిడవిట్ సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. పిటిషన్ విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం సుప్రీం కోర్టులో మరోసారి విచారణ జరిగింది.
మంగళవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. తమకు అఫిడవిట్ సమర్పించడానికి సమయం కావాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు మనవి చేసింది. పిటిషన్ విచారణను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేస్తున్నామని సుప్రీం కోర్టు తెలిపింది. కర్ణాటకలోని బసవరాజ్ ప్రభుత్వం ముస్లీంల రిజర్వేన్లను రద్దు చెయ్యడానికి గత కొంతకాలం ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఏం సమాధానం చెబుతోంది అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications