తిరుప్పరంకుండ్రమ్ కొండపై కార్తీక దీపోత్సవానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ట్విస్ట్

తమిళనాడులోని మధురై వద్ద ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుప్పరంకుండ్రమ్ కొండపై కార్తీక దీపం వెలిగించే వివాదానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన జరుగనున్న కార్తిక దీపోత్సవం సందర్భంగా కొండపై ఉన్న ప్రాచీన రాతి స్తంభం వద్ద భారీ దీపం వెలిగించడానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఒక్కసారికి మాత్రమే ఇది పరిమితమని స్పష్టం చేసింది. ఈ అంశంపై గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూనే.. ఈ సడలింపు ఇచ్చింది.

తిరుప్పరంకుండ్రమ్ కొండపై ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొండపై దీపోత్సవం ఎక్కడ నిర్వహించాలనే అంశంపై అనేక దశాబ్దాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సంప్రదాయబద్ధంగా కొండ దిగువ ప్రాంతంలో ఉన్న ఉచ్చిపిళ్లైయార్ గుడి సమీపంలోని మంటపం వద్ద ప్రతి ఏటా దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది.

Supreme Court allowed the lighting of the Karthika Deepam atop Thiruparankundram hill on November 24

కొండ పైభాగంలో ఉన్న హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో అత్యంత ప్రాచీన రాతి స్తంభమైన దీపత్తూన్, ఉందని, ప్రాచీన సంప్రదాయాల ప్రకారం అక్కడే దీపం వెలిగించాలని హిందూ సంఘాలు, భక్తులు డిమాండ్ చేస్తూ వస్తోన్నారు.. చాలాకాలంగా. దీనిపై మద్రాస్ హైకోర్టును సైతం ఆశ్రయించారు. రాతిస్తంభం వద్ద దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు గతంలో అనుమతి ఇచ్చింది.

సీఎం విజయ్ కు సడన్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
సీఎం విజయ్ కు సడన్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

స్థానిక పరిస్థితులు, భద్రత కారణాలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కొద్దీసేపటి కిందటే తీర్పు వెలువరించింది. ఇదివరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ ఒక్కసారికి మాత్రమే కార్తీక దిపోత్సవం నాడు రాతిస్తంభం వద్ద దీపాన్ని వెలిగించడానికి అనుమతి ఇస్తోన్నామని తెలిపింది.

తాడిపత్రి భగ్గు- కేతిరెడ్డి ఇల్లు, వాహనాలు బుగ్గి
తాడిపత్రి భగ్గు- కేతిరెడ్డి ఇల్లు, వాహనాలు బుగ్గి

భక్తులు గానీ, స్థానికులు గానీ కొండపైకి వెళ్లకుండా స్పష్టమైన ఆంక్షలు విధించింది.. ధర్మాసనం దేవస్థానం తరఫున అధికారికంగా ఎంపిక చేసిన వ్యక్తులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రమే కొండ పైభాగంలో ఉన్న దీపత్తూన్ వద్దకు వెళ్లాలని ఆదేశించింది. ప్రార్థనా సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన పోలీస్ భద్రతను కల్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.

పసిడి రేట్ల పతనం.. నానాటికీ తీవ్రరూపం: దెబ్బకొడుతోన్న పరిణామాలు
పసిడి రేట్ల పతనం.. నానాటికీ తీవ్రరూపం: దెబ్బకొడుతోన్న పరిణామాలు

ఈ తాత్కాలిక అనుమతి అనేది కొండపై ఎలాంటి శాశ్వత హక్కులను కల్పించదని కూడా ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ వేడుక కోసం కొండపైకి వెళ్లే అధికారుల బృందం సభ్యుల సంఖ్య, వారి వివరాలను మధురై జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, పురావస్తు శాఖ ప్రతినిధులు, పోలీస్ కమిషనర్‌తో కలెక్టర్ చర్చలు జరిపి ప్రణాళికను ఖరారు చేయనున్నారు. స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే సీఆర్పీఎఫ్ భద్రతను కూడా వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది.. సుప్రీంకోర్టు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+