చిన్నారులపై లైంగిక దాడులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానిదే ఆ బాధ్యత.!

ఢిల్లీ : చిన్నారులపై రోజురోజుకీ లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై మానవ మృగాలు రెచ్చిపోతూ ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోటని కాదు. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో లాంటి చట్టాలు ఉన్నప్పటికీ నిందితులు భయపడటం లేదు. అసలు అలాంటి చట్టం ఒకటుందనే విషయం కూడా చాలామందికి తెలియదనే వాదనలున్నాయి. జనాల్లో ఆ చట్టం గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడితే గానీ క్రైమ్ రేటు తగ్గదేమో.

అదలావుంటే దేశంలో రోజురోజుకీ చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులకు సంబంధించి సుప్రీంకోర్టులో గురువారం (25.07.2019) నాడు విచారణ జరిగింది. అయితే చిన్నారులపై లైంగిక దాడులు తగ్గుముఖం పట్టేలా కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా ఏయే జిల్లాల్లో పోక్సో చట్టం కింద వంద కేసులు పెండింగులో ఉన్నాయో.. అలాంటి చోట ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది.

Supreme Court Directs Setting Up Exclusive Courts To Handle Child Abuse Cases

చిన్నారులపై జరుగుతున్న దాడులకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆ మేరకు వాటిని సుమోటాగా స్వీకరించి విచారణ జరుపుతోంది. ఆ క్రమంలో గురువారం నాడు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలకు సంబంధించి నమోదవుతున్న కేసులను సత్వరం పరిష్కరించేలా 60 రోజుల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కోర్టుల నిర్వహణను కేంద్ర ప్రభుత్వమే చూసుకోవాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+