సుప్రీం క్లియర్: యాకూబ్‌ మెమెన్‌కు ఉరి ఖరారు

న్యూఢిల్లీ: ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమెన్ మెర్సీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారంనాడు కొట్టేసింది. యాకూబ్ మెమెన్ కేసులో న్యాయపరమైన అన్ని ప్రక్రియలను సరిగ్గా పాటించినట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

సాంకేతిక అంశాలను ప్రశ్నించిన మెమెన్ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరోసారి వాదనలు వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. న్యాయపరమైన ప్రక్రియలో ఏ విధమైన లోపాలు కూడా జరగలేదని సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ తేల్చి చెప్పింది. మెమెన్ పిటిషన్‌పై బుధవారం ఉదయం నుంచి సుదీర్ఘమైన వాదనలు జరిగాయి.

యాకూబ్ మెమెన్ క్షమాబిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు తోసిపుచ్చారు. దీంతో యాకూబ్ మెమెన్‌కు ఉరి ఖరారైంది. ఆయనను రేపు (గురువారం) ఉదయం 7 గంటలకు నాగపూర్ జైలులో ఉరి తీయనున్నారు.

ముంబై వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను రద్దు చెయ్యాలని దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం జస్టిస్ ఏఆర్. దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. స్టే విధించడానికి న్యాయమూర్తి దవే నిరాకరించారు. ఉరి శిక్షను అమలు చెయ్యడాన్ని న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ వ్యతిరేకించారు.

Supreme Court has rejected the petition filed by Yakub Memon seeking mercy.

ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయ్యడంతో పిటిషన్ ను అత్యున్నత స్థాయి ధర్మాసనానికి బదలి చేస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు. అతను సుప్రీం కోర్టులో సమర్పించిన పిటిషన్ మంగళవారం విచారించిన న్యాయస్థానం ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారంనాడు అత్యున్నత ధర్మాసనం యాకూబ్ క్యురెటివ్ పిటిషన్‌ను కొట్టేసింది.

ఉరి తీయాలని ముంబైలో ఆందోళన

ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమెన్‌ను ఉరి తీయాలంటూ బుధవారం ముంబైలో ఆందోళన నిర్వహించారు. 1993 నాటి పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయినవారి బంధువులు ఈ ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ను కలిసి యాకూబ్‌ మెమెన్‌కు ఉరి శిక్ష అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరి ఆందోళనకు శివసేన పార్టీ మద్దతు తెలిపింది. మెమెన్‌ క్షమాభిక్ష కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాగా, యాకూబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ మళ్లీ రాష్ట్రపతి వద్దకు వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+