Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి ఫైన్: అది గనక కట్టకపోతే: సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందట తీర్పు వెలువరించింది. ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించింది. ఆ రూపాయిని ఆయన కట్టకపోతే.. మూడు నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. మూడేళ్ల పాటు న్యాయవాద వృత్తికి దూరంగా ఉండాల్సి వస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ప్రశాంత్ భూషణ్‌పై దాఖలైన కోర్టు ధిక్కారణ కేసులో ఇప్పటికే విచారణను ముగించిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 25వ తేదీన తన విచారణను ముగించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిర్ కృష్ణ మురారి ఈ తీర్పుపై విచారణను ముగించారు. తీర్పును సోమవారానికి రిజర్వ్ చేశారు. కాస్సేపటి కిందటే జస్టిస్ అరుణ్ మిశ్రా తీర్పును వినిపించారు. ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

Supreme Court imposes a fine of Re 1 fine on senior lawyer Prashant Bhushan

ఆ మొత్తాన్ని ఆయన చెల్లించకపోతే ప్రత్యామ్నాయంగా మూడునెలల కారాగార శిక్షను అనుభవించాల్సి ఉంటుందని, మూడు నెలల పాటు న్యాయవాద వృత్తికి దూరంగా ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానానికి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదని భావిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ధిక్కార కేసులో ఈ నెల 14వ తేదీన ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. క్షమాపణ చెప్పడానికి గడువు విధించింది. క్షమాపణ చెప్పడానికి ఆయన అంగీకరించలేదు.

Recommended Video

    Adipurush : Prabhas To Star In Om Raut’s 3D Action Drama Adipurush || Oneindia Telugu

    క్షమాపణ అంటూ చెబితే.. తప్పు చేసినట్లు అంగీకరించినట్టవుతుందని ప్రశాంత్ భూషణ్ భీష్మించారు. ఫలితంగా ఈ కేసు ఇక్కడిదాకా వచ్చింది. ప్రశాంత్ భూషణ్ జూన్ 27న చేసిన రెండు ట్వీట్లు కోర్టు ధిక్కారానికి కారణం అయ్యాయి. దేశంలో అనధికారికంగా అత్యవసర పరిస్థితిని విధించినట్టు కనిపిస్తోందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ ఆయన ట్వీట్లు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. అలాగే- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ బైక్‌పై కనిపించిన సమయంలో హెల్మెట్ ధరించకపోవడాన్నీ ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+