ఈనెల 11వ తేదీన కీలకమైన తీర్పు వెలువరించబోతున్న సుప్రీంకోర్టు
ఈనెల 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకమైంది. మహారాష్ట్రలో శివసేన రెబెల్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు భారత ప్రజాస్వామ్యానికే మైలురాయిగా నిలవబోతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. శివసేన భవితవ్యాన్ని కూడా ఈ తీర్పు నిర్ణయించబోతోంది.
శివసేన ఎన్నికల గుర్తు విల్లు-బాణం తమేదనని, రెబల్ ఎమ్మెల్యేలు ఆ గుర్తును వాడుకోవడానికి వీల్లేదని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పదవి కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని, తన ఆధ్వర్యంలో బీజేపీ కూల్చేసిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.

భారతీయ జనతాపార్టీ తనను, తన కుటుంబాన్ని రెండున్నర సంవత్సరాలుగా టార్గెట్ చేసిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేతలందరికీ ఆ విషయం తెలుసని, అప్పుడు వారంతా మౌనంగా ఉంటూ బీజేపీతో టచ్‌లో ఉండి సొంత పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. శివసేన ఎన్నికల గుర్తు విల్లు-బాణం తమదేనంటూ రెబెల్ నేతలు క్లెయిమ్ చేసుకుంటుండటంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించానని, ఇటువంటి సమయంలో లెజిస్లేచర్ పార్టీ వేరు, అసలు పార్టీ వేరని, అసలు పార్టీ, ఆ పార్టీ గుర్తు అలాగే ఉంటుందని వివరించారు. తమ పార్టీ ఎంపీలతో చర్చించిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications