ప్రెస్ మీట్ ఎఫెక్ట్: రంజన్ గగోయ్ తదుపరి సీజేఐ కాలేరా?
న్యూఢిల్లీ: ఊహించని విధంగా దేశ చరిత్రలో తొలిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి పలు కీలక విషయాలను పంచుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Recommended Video

అత్యున్నత న్యాయస్థానంలోనే అవాంఛనీయ ఘటనలు చోటు చోటు చేసుకుంటున్నాయని వారు వాపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆసక్తికరంగా
సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జాస్తి ఛలమేశ్వర్, రంజన్ గగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్‌లు ప్రధాన న్యాయమూర్తి తర్వాత వీరే సీనియర్లుగా ఉన్నారు. వీరే మీడియా ముందుకు రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

విమర్శలు.. మద్దతు
ఈ నలుగురు న్యాయమూర్తులకు పలువురు రిటైరైన జడ్జీలు మద్దతు పలుకగా, మరికొందరు వీరికి వ్యతిరేకంగా మాట్లాడారు. న్యాయం చేయాల్సిన న్యాయమూర్తులు ఇలా మీడియా ముందుకు రావడం ఏంటని పలువురు తీవ్రంగా స్పందించారు.

రంజన్ గగోయ్‌పై తీవ్ర ప్రభావం
కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి దీపక్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసిన ఈ నలుగురిలో జస్టిస్ రంజన్ గగోయ్‌పై తీవ్ర ప్రభావమే పడనున్నట్లు తెలుస్తోంది. దీపక్ మిశ్రా తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవీబాధ్యతలను చేపట్టాల్సిన గగోయ్‌పై.. ఈ మీడియా వ్యవహారం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

దీపక్ మిశ్రా ఏం చేస్తారో?
ఎందుకంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తర్వాత బాధ్యతలను చేపట్టనున్న వారి పేర్లను సీనియార్టీ ప్రకారం రాష్ట్రపతికి అందజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గగోయ్‌ను కాకుండా మరో సీనియర్ న్యాయమూర్తి పేరును దీపక్ మిశ్రా రాష్ట్రపతి పంపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications