వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచితాలపై సుప్రీం కీలక ప్రశ్నలు-రాజకీయ పార్టీల్ని ఆపలేం- ఏది సంక్షేమమో తేల్చాల్సిందే..

|
Google Oneindia TeluguNews

ఎన్నికల్లో ఉచిత పథకాల్ని ప్రకటించడంపై సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో వీటిని సవాల్ చేస్తూ డీఎంకే పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో రాష్ట్రాలు ప్రకటించే పథకాలే కాదు కేంద్రం ఇచ్చే ఉచితాలపైనా విచారణ చేయాలని, అసలు ఉచితమేంటో తేల్చాలని కోరింది. ఈ పిటిషన్ లో తమనూ భాగస్వాముల్ని చేయాలని కోరింది.
దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ఉచితాల అంశంపై డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా కోర్టు ఆపలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.సంక్షేమాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీజేఐ అన్నారు. ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి ఇక్కడ ఆందోళన సరైన మార్గమని, ఈ విషయం చాలా క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిశీలించడానికి న్యాయస్థానానికి అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా తమ ముందు ఉందన్నారు.

supreme court key comments on freebies-cant stop political parties from making promises

రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు నిరోధించలేదని, అయితే ముందుగా ఏది ఉచిత పథకమనేది తేల్చాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ తెలిపారు. ఉచిత విద్య హామీ రాజకీయ పార్టీల అనుచితాల్లోకి వస్తుందా రాదా అన్నది నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. అలాగే వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పంపిణీని సంక్షేమం అని అనొచ్చా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న అని ఎన్వీ రమణ తెలిపారు. దీన్ని కొందరు ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అంటున్నారని, మరికొందరు సంక్షేమం అంటున్నారని వ్యాఖ్యానించారు. కాబట్టి మీరు మీ వాదనలు వినిపించండి, మా తీర్పు మేం ఇస్తామన్నారు.

అలాగే ఉచితాల వల్లే రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని చెప్పలేమని కూడా సుప్రీంకోర్టు సీజే వెల్లడించారు. దీనికి ప్రజలకు గౌరవంగా బతికే హక్కు కల్పిస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉదాహరణగా చూపారు. వచ్చే వారం దీనిపై మరోసారి వాదనలు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

English summary
supreme court on today made key comments on dmk's petititon over freebies distribution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X