పెళ్లి కాకుండా పుట్టిన బిడ్డ ఎవరికి చెందాలి? సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

ప్రస్తుత ఆధునిక కాలంలో పెళ్లి బంధం కంటే లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలాంటి సంబంధాల్లో విభేదాలు తలెత్తినప్పుడు వారికి పుట్టిన పిల్లల సంరక్షణ ఎవరికి దక్కాలనే దానిపై న్యాయస్థానాల ముందు క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ కీలక కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన చిన్నారి తాత్కాలిక కస్టడీ విషయంలో తల్లికే మొదటి హక్కు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. జర్మనీకి చెందిన ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని చదువు నిమిత్తం సింగపూర్ తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సీఎం విజయ్ కు సడన్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
సీఎం విజయ్ కు సడన్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అసలేం జరిగిందంటే?
జర్మనీ పౌరురాలైన ఓ మహిళ ఢిల్లీకి చెందిన ఓ భారతీయ న్యాయవాది వివాహం చేసుకోకుండానే సహజీవనం చేశారు. వీరికి 2022లో ఒక బాబు జన్మించాడు. తల్లి సింగపూర్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తుండగా.. తండ్రి ఢిల్లీలో లా ఫర్మ్ నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో నాలుగేళ్ల బాబు కస్టడీ కోసం న్యాయపోరాటం మొదలైంది. తండ్రి తనను బాబుతో కలవనివ్వడం లేదని ఆరోపిస్తూ తల్లి ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు బాబు శాశ్వత కస్టడీ కోసం తండ్రి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. చివరికి బాబును తనతో పాటు సింగపూర్ తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ తల్లి సుప్రీంకోర్టు తలుపుతట్టారు.

Supreme Court Landmark Verdict Mother Holds First Claim to Custody of Unwed Parents Child Details

నిమ్హాన్స్ పరీక్షలు, కోర్టు పరిశీలన
ఈ కేసులో ముందుగా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో బెంగళూరులోని నిమ్హాన్స్ నిపుణులతో తల్లిదండ్రులు, బాబుకు మానసిక పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. తల్లిదండ్రులు ఇద్దరూ బాబును చూసుకోవడానికి సమర్థులేనని నిమ్హాన్స్ నివేదిక ఇచ్చింది. తల్లి మానసిక ఆరోగ్యంపై తండ్రి చేసిన ఆరోపణలు కోర్టు తోసిపుచ్చింది.

జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి కీలక కామెంట్స్ చేసింది. చిన్నారి సంరక్షణ విషయంలో భారతీయ న్యాయ దృక్పథంతో పాటు అంతర్జాతీయ సూత్రాల ప్రకారం తల్లికే ప్రాధాన్యత ఉంటుందని కోర్టు పేర్కొంది. అంతమాత్రాన తండ్రి హక్కులు పూర్తిగా రద్దు కావని, ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేసింది.

తల్లికి ప్రభుత్వం ఇచ్చిన భూమిపై కొడుకుకు హక్కు లేదు! హైకోర్టు సంచలన తీర్పు!!
తల్లికి ప్రభుత్వం ఇచ్చిన భూమిపై కొడుకుకు హక్కు లేదు! హైకోర్టు సంచలన తీర్పు!!

రూ.కోటి డిపాజిట్ సహా కఠిన షరతులు
బాబును సింగపూర్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తూనే సుప్రీంకోర్టు తల్లికి పలు కఠిన షరతులు విధించింది. మూడు వారాల్లోగా సింగపూర్ కోర్టు నుంచి మిర్రర్ ఆర్డర్ పొంది సుప్రీంకోర్టులో సమర్పించాలి. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ.కోటి డిపాజిట్ చేయాలి. దీనిని రెండేళ్లు లేదా కేసు పరిష్కారమయ్యే వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా ఉంచుతారు. తండ్రి ప్రతిరోజూ బాబుతో వీడియో కాల్‌లో మాట్లాడే అవకాశం కల్పించాలి. సింగపూర్ వెళ్లి కలిసేందుకు, అలాగే ఏడు రోజులకు మించి స్కూల్ సెలవులు వస్తే బాబును భారత్‌కు తీసుకొచ్చి తండ్రి వద్ద ఉంచేందుకు అనుమతించాలి. బాబులో తండ్రి పట్ల వ్యతిరేక భావం కలగకుండా ఉండేందుకు ప్రతి ఆరు నెలలకోసారి మానసిక నిపుణుల నివేదికను కోర్టుకు సమర్పించాలి.

తల్లికి 'వర్క్ ఫ్రమ్ హోమ్' సదుపాయం ఉండటం, సింగపూర్లో బాబు చదువు, సంరక్షణకు ఆమె చూపిన ప్రణాళిక బాగుండటంతో చిన్నారి 'ఉత్తమ ప్రయోజనాల' దృష్ట్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బాబు శాశ్వత కస్టడీపై ఢిల్లీలోని పాటియాలా హౌస్ ఫ్యామిలీ కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+