చిన్నమ్మ శశికళ భర్తకు సుప్రీం కోర్టు ఆదేశాలు, వెంటనే లొంగిపోవాలి, లేదంటే ?

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళకు మరో కష్టం ఎదురైయ్యింది. విదేశాల నుంచి ఖరీదైన విలాసవంతమైన కారును అక్రమంగా దిగుమితి చేసుకున్న కేసులో శశికళ భర్త నటరాజన్ కు ఎదురుదెబ్బ తగిలింది.

అనారోగ్యంతో ఉన్న తాను ఇంకా కొంత కాలం బయటే ఉంటానని శశికళ భర్త నటరాజన్ సుప్రీం కోర్టులో సమర్పించిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వెంటనే మీరు పొలీసుల ముందు లోంగిపోవాలని శుక్రవారం సుప్రీం కోర్టు నటరాజన్ కు ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court ordered to Sasikala's Husband Natarajan to surrender immediately

విదేశాల నుంచి అక్రమంగా ఖరీదైన విలాసవంతమైన కారు కొనుగోలు చేసి పన్ను చెల్లించకుండా మోసం చేశారని వీకే శశికళ భర్త నటరాజన్, టీటీవీ దినకరన్ సోదరుడు టీటీవీ భాస్కరన్ ల మీద 20 ఏళ్ల క్రితం కేసు నమోదు అయ్యింది.

అప్పటి నుంచి కేసు విచారణ జరిగింది. ఇటీవల శశికళ భర్త నటరాజన్, టీటీవీ భాస్కరన్ నేరం చేశారని రుజువు కావడంతో చెన్నై న్యాయస్థానం ఇద్దరికీ రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అనారోగ్యంతో ఉన్న తనకు చికిత్స చేయించడానికి అవకాశం ఇవ్వాలని నటరాజన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే నటరాజన్ సమర్పించిన పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు వెంటనే లోంగిపోయి జైలుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+