గాలి జనార్దన్ రెడ్డి బ్యాక్ టూ బళ్లారి: అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు, అయితే, ఎందుకంటే !
మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లడానికి గురువారం సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసుల్లో షరతులతో బెయిల్ మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీ
న్యూఢిల్లీ/బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లడానికి గురువారం సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసుల్లో షరతులతో బెయిల్ మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీ జిల్లాకు దూరంగా ఉంటున్నారు.
సాక్షాలు నాశనం చెయ్యకూడదని, బళ్లారి జిల్లాలో అడుగు పెట్టకూడదని తదితర షరతులు విదిస్తూ గాలి జనార్దన్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కుమార్తె పెళ్లి కోసం, సంక్రాంతి పండుగ, దీపావళి పండుగ జరుపుకోవడం కోసం సుప్రీం కోర్టు అనుమతితో గాలి జానర్దన్ రెడ్డి బళ్లారికి వెళ్లి వచ్చారు.

గాలి జనార్దన్ రెడ్డి సమీప బంధువుల ఇంటిలో పెళ్లి శుభకార్యం జరుగుతున్న సందర్బంగాద ఆయన మళ్లీ బళ్లారి వెళ్లడానికి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నవంబర్ 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో ఉండటానికి గురువారం సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. షరతులు ఉల్లంఘించకూడాదని మాజీ మంత్రి గాలి జానర్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు మరో సారి గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications