గాలి జనార్ధన్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు - హైదరాబాద్ సీబీఐ కోర్టుకు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను రద్దు చేసింది. బెయిల్‌లో మార్పులు చేయాలంటూ ఆయన కొద్దిరోజుల కిందటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇదివరకే విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఇవ్వాళ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌పై ఉన్నారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ ఆయనకు ఇదివరకే మంజూరయింది. ఇందులో మార్పులు చేయాలంటూ కొద్దిరోజుల కిందటే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Supreme Court pronounce order on G Janardhana Reddys plea to visit Bellary in Karnataka

బళ్లారికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు. బెయిల్ నిబంధన సడలించాలని లేదా దాన్ని కొట్టివేయాలని కోరారు. బళ్లారి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన తన కుమార్తెను చూడటానికి తన స్వస్థలమైన బళ్లారికి వెళ్లాల్సి ఉందని, దీనికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.

కాగా, దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం ఇదివరకే విచారణ ముగించింది. తీర్పును ఇవ్వాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ తుది ఆదేశాలను జారీ చేసింది. బెయిల్‌ను రద్దు చేయాలంటూ గాలి జనార్దన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టేసింది. నెలరోజుల పాటు మాత్రమే బళ్లారిలో నివసించడానికి అనుమతి ఇచ్చింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారినెవరినీ కలుసుకోకూడదని పేర్కొంది సుప్రీంకోర్టు ధర్మాసనం.

పలువురు సాక్ష్యులు బళ్లారికి చెందిన వారే కావడం వల్ల ఈ ఆంక్షలు విధించినట్లు భావిస్తోన్నారు. అదే సమయంలో అక్రమ మైనింగ్ కేసులో ట్రయల్స్ మొదలు పెట్టాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని, ఆరు నెలల్లోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని డెడ్‌లైన్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+