వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్దార్ జోకులపై పిటిషన్ తిరస్కరణ, మార్గదర్శకాలు ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు

సిక్కులపై జోకులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సర్దార్ జోకులపై నిషేధం విధించలేమని, ఒకవేళ అలా తీర్పు ఇచ్చినా దానిని అమలు పరచలేమంటూ తిరస్కరించింది

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సర్దార్ జోకులపై నిషేధం విధించడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిక్కులపై జోకులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం కోర్టు విచారణ జరిపింది.

పౌరులకు నైతికపరమైన మార్గదర్శకాలను ఇవ్వలేమని, అలాంటి ఆదేశాలు ఇచ్చి వాటిని పాటించేలా చేయడం అసాధ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. హర్వీందర్ చౌదరి అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Supreme Court Refuses To Issue Guidelines Banning Sardar Jokes

సిక్కులకు సమాజంలో చాలా గౌరవముందని, ఇలాంటి పిటిషన్ల ద్వారా దాన్ని తగ్గించుకోవద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. 'ఒకవేళ కోర్టు మార్గదర్శకాలు జారీ చేస్తే మాత్రం వాటిని ఎలా అమలు చేస్తాం.. ఎవరు పాటిస్తారు? ' అని కోర్టు ప్రశ్నించింది.

జోకులు అనేవి సమాజానికి, మనస్తత్వానికి సంబంధించిన అంశమని పేర్కొంది. సిక్కులపై వస్తున్న సర్దార్ జోకులు తమ మతాన్ని తప్పుగా చూపిస్తున్నాయని... ఇలాంటి జోకులు వేసే వారిపై, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని, నిందితులకు ఆర్నెల్ల నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చెయ్యాలని హర్వీందర్ కౌర్ వాదించారు.

English summary
NEW DELHI -- The Supreme Court on Tuesday refused to issue detail guidelines banning Sardar/Sikh jokes and said it would pass a detailed formal order on 27 March. During the hearing, the apex court observed that it is has no right to frame guidelines on the issue and asked the aggrieved to opt for alternate mechanism like 66 A of the Information Technology Act 2000 or to seek justice under the relevant sections of the Indian Penal Code (IPC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X