మోడీ బయోపిక్ నిర్మాతలకు సుప్రీం షాక్

ఢిల్లీ : పీఎం నరేంద్రమోడీ చిత్ర నిర్మాతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మోడీ బయోపిక్ విడుదలపై ఈసీ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈసీ నిర్ణయంలో తాము కల్పించుకోలేమని తేల్చి చెప్పింది.

ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ మోడీ బయోపిక్‌పై నిషేధం విధించింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌పై ఈ నెల 15న విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సినిమా చూసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం ఉత్తర్వుల మేరకు ఎన్నికల సంఘం ఈ నెల 22న సీల్డ్ కవర్‌లో నివేదిక అందించింది.

Supreme Court Refuses to Lift Ban on Release of Modi Biopic

మోడీ బయోపిక్ ఓ రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చేలా ఉందన్న ఈసీ నివేదికను ధర్మాసనం శుక్రవారం పరిశీలించింది. సినిమా విడుదలను నిషేధిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం సబబేనని చెప్పింది. మోడీ బయోపిక్‌ను చివరి దశ ఎన్నిక పూర్తయ్యే మే 19వ తేదీ వరకు విడుదల చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+