ఇందులో తొందరేముంది?: సుప్రీం కోర్టు షాకిచ్చింది

కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ను ఎన్నికల నేపథ్యంలో ఆపించే ఉద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర వాదనల కింద విచారించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు నిరాకరించింది.

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ను ఎన్నికల నేపథ్యంలో ఆపించే ఉద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర వాదనల కింద విచారించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు నిరాకరించింది.

అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున బడ్జెట్‌ సమర్పణను వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని త్వరగా విచారించడానికి సుప్రీం కోర్టు ఈ రోజు నిరాకరించింది.

Supreme Court refuses 'urgent' plea on deferring budget

అందులో తొందరేముందని, పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు చూడవచ్చునని ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ అధ్యక్షతన ఉన్న ధర్మాసనం పేర్కొంది. ప్రముఖ న్యాయవాది ఎంఎల్‌ శర్మ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు.

దీనిని త్వరగా విచారించాలని కోరారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బీజేపీ ఎన్నికల చిహ్నం కమలంను తొలగించాలని కూడా ఈ పిల్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+