గూగుల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. రూ. 1337 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ) తీర్పును వ్యతిరేకిస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది.
ఆండ్రాయిడ్ ఉత్పత్తులకు సంబంధించి తన ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని, అనైతికంగా, పోటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలో రూ. 1337 కోట్ల పెనాల్టీ విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్‌సీఎల్ఏటీని ఆశ్రయించింది గూగుల్. అక్కడ కూడా గూగుల్‌కు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. జరిమానాలో 10 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లో జమ చేయాలని ఆదేశించింది.
ఎన్‌సీఎల్ఏటీ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ గూగుల్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్థివాలా త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసును తిరిగి ఎన్‌సీఎల్ఏటీకి అప్పగించింది. అంతేగాక, మార్చి 31లోగా కేసును పూర్తి చేయాలని తెలిపింది.

గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన పెనాల్టీలో 10 శాతం డిపాజిట్ చేసేందుకు గూగుల్‌కు ఏడు రోజుల పాటు గడువును విధించింది ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం. అంతేగాక, కేసు విచారణ కోసం గురువారం నుంచి మూడు రోజుల్లోగా ఎన్‌సీఎల్ఏటీని సంప్రదించాలని గూగుల్ ను కోర్టు ఆదేశించింది.
సీసీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరమణన్ గతంలో వాదనలు వినిపించారు. గూగుల్ సంస్థ యూరప్ దేశాల్లో ఒక విధంగా, భారతదేశంలో మరోలా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యూరోపియన్ కమిషన్ ఆదేశాలను గూగుల్ పాటిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. గూగుల్ సంస్థకు ఈ భారీ జరిమానా తప్పేలా లేదు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications