వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే బిల్లుపై కేంద్రానికి నోటీసులు : సుప్రిం కోర్టు

కేంద్రం ఇటివల ఆమోదించిన యూఏపీఏ చట్టాన్ని సవాలు చేస్తూ నమోదైన పిటిషన్‌ను సుప్రిం కోర్టు స్వీకరించింది. పిటిషన్‌‌ను విచారించేందుకు కేంద్రానికి నోటీసులు దాఖలు చేసింది. ఇక ఈ చట్టం ప్రకారం తీవ్రవాద కార్యకలాపాలతోపాటు సంఘవ్యతిరేక శక్తులను తీవ్రవాదులుగా ప్రకటించనున్నారు. ఈ చట్టం ప్రకారం ప్రజలు తమ నిరసనను, అసంతృప్తిని తెలియ చేసే హక్కును ఈ చట్టం కాలరాస్తుందని పిటిషనర్ పేర్కోన్నారు.ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాల పేరుతో వ్యక్తులను నిర్భంధించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కోన్నారు.

కేంద్రం తెచ్చిన చట్టంపై ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ తోపాటు సాజల్ ఆవాస్తి అనే పౌరుడు సుప్రిం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.దీంతో పిటిషన్‌ స్వీకరించిన సుప్రింకోర్టు చీఫ్ జస్టీస్ రంజన్‌ గగోయ్‌తో పాటు జస్జీస్ అశోక్ భూషన్‌లు కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.పౌరులకు రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును ఈ చట్టం నిరోధిస్తుందని, టెర్రరిస్టుగా ముద్రపడిన వ్యక్తి అరెస్ట్‌ కాకుండా తనను తాను సమర్ధించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించడం లేదని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Supreme Court sends notice to Centre to hear plea against amended anti-terror law,

మోడీ సర్కారు కీలక బిల్లుకు ఆగస్టు2న పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకుంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో కీలక చర్చ అనంతరం ఒటింగ్ కూడ జరిగింది. దీంతో 147 మంది అనుకూలంగా 42 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉగ్రవాదానికి మతం లేదని మానవాళికకి ఉగ్రవాదులు వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దీంతో యూఏపీఏ సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్ వీగిపోయింది. ఈ ప్రతిపాదనకు 104 మంది సభ్యులు వ్యతిరేకంగా, 85మంది అనుకూలంగా ఓటు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+