లేడీ టెక్కీని రేప్ చేసి చంపేశాడు, వీడిని చచ్చేవరకు జైల్లో పెట్టండి, సుప్రీం కోర్టు !
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రముఖ కంపెనీలో ఆ యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరింది. తక్కువ వయసులోనే మంచి జీతం సంపాధించింది, మంచి ఉద్యోగం చేస్తున్న తాను భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా జీవితం గడపాలని అనుకుంది. అయితే నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని కంపెనీ నుంచి ఇంటికి వెలుతున్న లేడీ టెక్కీ మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. లేడీ టెక్కీ మీద అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు సరైన శిక్ష విధించింది.
బెంగళూరు నగరంలో నివాసం ఉండే 28 ఏళ్ల యువతి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరింది. మంచి జీతం సంపాధిస్తున్న లేడీ టెక్కీ క్యాబ్ లో ఆఫీస్ కు వెళ్లి వచ్చేది. అప్పటికే లేడీ టెక్కీకి వివాహం అయ్యింది. లైఫ్ లో సెటిల్ అయ్యి భర్త, పిల్లలు, బంధువులతో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ యువతి అనేక కలలుకనింది.

నైట్ డ్యూటీ ముగించుకున్న లేడీ టెక్కీ క్యాబ్ లో ఆమె ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో క్యాబ్ డ్రైవర్ శివకుమార్ అలియాస్ శివ అలియాస్ శివమూర్తి లేడీ టెక్కీ మీద అత్యాచారం చేశాడు. లేడీ టెక్కీ మ్యాటర్ బయటకు చెబుతుందనే భయంతో ఆమెను దారుణంగా చంపేశాడు. లేడీ టెక్కీని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
నిందితుడు శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు సమర్థించింది. నిందితుడు శివకుమార్ తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్, ఓకా, జస్టిస్ రాజేష్ బిందల్ నిందితుడు క్యాబ్ డ్రైవర్ శివకుమార్ పిటిషన్ ను విచారణ చేశారు.













Click it and Unblock the Notifications