పైలట్లను టార్గెట్ చేస్తారా..! ఎయిరిండియా క్రాష్ రిపోర్ట్ పై సుప్రీం ఫైర్..!

ఈ ఏడాది గుజరాత్ లోని సర్దార్ పటేల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఘటనలో దాదాపు 300 మంది చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు నివేదికలో పైలట్ల తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పైలట్లపై విమర్శలు వచ్చాయి. దీనిపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సైలెంట్ అయిపోయింది.

అయితే తాజాగా సుప్రీంకోర్టులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఇప్పటికే వెలువడిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో పైలట్ల తప్పిదం అని తేలిందని, కాబట్టి దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా పైలట్లను టార్గెట్ చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించింది.

Supreme Court Terms Pilot Error Remark in Air India Crash Report as Unfortunate

రేపు ఎవరైనా బాధ్యతారహితంగా పైలట్ ఏ లేదా బీ తప్పు చేశారని చెబితే, ఆ కుటుంబం బాధపడుతుంది. తుది విచారణ నివేదికలో ఏ తప్పు లేదని తేలితే ఏం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దురదృష్టవశాత్తు, కొన్నిసార్లు అలాంటి విషాదం జరిగినప్పుడు, ప్రత్యర్థి విమాన కంపెనీలు ప్రయోజనం పొందుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పారదర్శకంగా, న్యాయంగా, వేగవంతమైన దర్యాప్తు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ , పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసింది.

Supreme Court Terms Pilot Error Remark in Air India Crash Report as Unfortunate

ఎయిర్‌బస్ లేదా బోయింగ్ వంటి విమాన తయారీదారులపై ఎలాంటి ఆరోపణలూ రావని,ఎందుకంటే వారు విమానం సరిగ్గా నడుపుతూ క్లియరెన్స్ తీసుకున్నట్లు వాదిస్తారని గుర్తుచేసింది. ఎవరైనా విమానయాన సంస్థ సిబ్బందిని నిందించడం ప్రారంభించవచ్చని, ఎవరూ పుకార్లు సృష్టించడానికి లేదా పరిస్థితిని తప్పుగా సూచించడానికి అనుమతించకూడదని సుప్రీంకోర్టు విచారణ సందర్బంగా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+