వుయ్ విల్ టేక్ ఎ కాల్.. ఈసీ వ్యవహారంపై తేల్చి చెప్పిన సీజేఐ సూర్యకాంత్ బెంచ్

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2023 లో తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే అంశంపై గతంలో వచ్చిన స్ప్లిట్ వర్డిక్ట్ తీర్పును ఉపసంహరించుకోవాలంటూ దాఖలైన దరఖాస్తును పునఃపరిశీలించడానికి అంగీకరించింది.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు చోటు చేసుకుంటోండటం, 2023 నాటి ఈ చట్టం ద్వారా ఈసీ నియామకాలను కేంద్రం తనకు అనుకూలంగా, ఏకపక్షంగా మార్చుకుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాత చట్టంలో సమూల మార్పులు చేస్తూ తీసుకొచ్చిన ఈ యాక్ట్ పై న్యాయమూర్తులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చర్చనీయాంశమౌతోంది.

Supreme Court to Decide Recall Application After Split Views Election Commissioner Appointment Bench

కేంద్రం 2023 లో తెచ్చిన చట్టం చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలా వద్దా అనే అంశంపై కిందటి నెల 23న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ఇద్దరు న్యాయమూర్తులల ధర్మాసనం స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చింది. భిన్నమైన తీర్పులను వినిపించింది. దీనిపై ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. జస్టిస్ దత్తా బదిలీ అభ్యర్థనను తోసిపుచ్చగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దీనిని సమర్థించారు.

సడన్ గా తమిళనాడు సీఎంఓ లో షర్మిల: విజయ్ తో భేటీ
సడన్ గా తమిళనాడు సీఎంఓ లో షర్మిల: విజయ్ తో భేటీ

దీనికి మూలం.. సీఈసీ, ఈసీల ఎంపిక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్పులే. నూతన చట్టం ప్రకారం ఈసీల ఎంపిక కమిటీ నుండి సీజేఐని తొలగించారు. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు గానీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర క్యాబినెట్ అధికారి.. ఈ సెలెక్షన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సీఈసీ, ఈసీ నియామకాలు చేపడుతుంది. ఈ కొత్త నిబంధనల వల్ల నియామక ప్రక్రియలో పారదర్శకత దెబ్బతింటుందని, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందంటూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకరనారాయణన్ రీకాల్ పిటీషన్ దాఖలు చేశారు. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన స్ప్లిట్ వర్డిక్ట్ ను రీకాల్ చేయాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమక్షానికి వచ్చిందీ రీకాల్ పిటిషన్. భిన్నాభిప్రాయాల తీర్పు నేపథ్యంలో ఈ రీకాల్ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరారు.

ఇదే వ్యవహారంపై ఓ క్యురేటివ్ పిటిషన్ కూడా దాఖలైందని గుర్తు చేశారు. తాము దాఖలు చేసిన రీకాల్ పిటీషన్ ఇంటెరిమ్ అప్లికేషన్ గా భావించాలని వివరించారు. క్యురేటివ్ పిటిషన్ తో దీన్ని క్లబ్ చేయవద్దని కోరారు. ఈ క్యురేటివ్ పిటీషన్ విచారణను సొంతంగానే కొనసాగించాలని, విచారణకు అది ఎంతవరకు అర్హమైనదనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తన రీకాల్ పిటిషన్‌ను విడిగా పరిశీలించాలని బెంచ్ ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+