చిన్నారి హత్య ఘటన: కీచకుడికి ఉరి శిక్ష, స్పెషల్ కోర్టు తీర్పును సమర్థించిన గుజరాత్ హైకోర్టు
కామంతో కళ్లు మూసుకున్న యువకుడి చిన్నారి అని కూడా చూడలేదు. మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడికి తెగబడ్డాడు. తర్వాత హతమార్చి ప్లాస్టిక్ సంచిలో కుక్కాడు. గుజరాత్‌లోని సూరత్‌లో ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడు అనిల్ యాదవ్‌కు ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష కూడా విధించింది. స్పెషల్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది..

గతేడాది ఘటన
గతేడాది అక్టోబర్‌లో అనిల్ యాదవ్ అనే కీచకుడు దారుణానికి ఒడిగట్టాడు. బీహర్‌కు చెందిన అనిల్ యాదవ్, సూరత్‌లో ఉంటున్నాడు. అక్కడ తెలిసిన వారి పాపను ఏడాది క్రితం కిడ్నాప్ చేశాడు. చిన్నారిని అతని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత చిన్నారిని హతమార్చి ప్లాస్టిక్ సంచిలో పెట్టాడు. తమ చిన్నారి కనిపించడం లేదని పేరెంట్స్ చూశారు. తర్వాత అనిల్ ఇంట్లో ప్లాస్టిక్ సంచిలో ఉండటం చూసి నిర్ఘాంతపోయారు.

ప్రత్యేక కోర్టు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడు అనిల్ యాదవ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. కింది కోర్టు విధించిన శిక్షను హైకోర్టులో అప్పీల్ చేయడంతో.. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుడు అనిల్ యాదవ్‌కు ఉరిశిక్ష విధించాలని తన తీర్పులో శుక్రవారం పేర్కొన్నది.

38 మంది సాక్షుల
గతేడాది లైంగికదాడి జరిగిన తర్వాత నిందితుడు అనిల్ యాదవ్ పారిపోయాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు గాలించి పట్టుకొన్నారు. కేసు విచారణలో భాగంగా 38 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీంతోపాటు చిన్నారికి జరిపిన వైద్య పరీక్షలు, అటాప్సీని చార్జీషీట్‌లో పొందుపరిచారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications