దసరా స్పెషల్: న్యూ ట్రెండ్.. న్యూ లుక్: వీపుపై చంద్రయాన్-2, ఆర్టికల్ 370 టాటూలు: గర్భా డాన్స్ లతో!
అహ్మదాబాద్: దసరా పండుగ అనగానే హైదరాబాద్ లో ఛప్పున గుర్తుకొచ్చేది గర్భా డాన్స్. జంటనగరాల్లో స్థిరపడిన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు.. ప్రత్యేకించి- గుజరాతీయులు దేవీ శరన్నవరాత్రులను అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దసరా పండుగ కొనసాగినన్ని రోజులూ రాత్రివేళ గర్భా డాన్స్ లతో అదర గొడుతుంటారు. ఈ సందర్భంగా వారి వస్త్రధారణ ఆకట్టుకునేలా ఉంటుంది. గుజరాతీ సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి బీట్ కు అనుగుణంగా స్టెప్స్ వేస్తూ సందడి చేస్తుంటారు. హైదరాబాద్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. గర్భా నృత్యానికి పుట్టినిళ్లుగా చెప్పుకొనే గుజరాత్ లో ఇంకెంత కోలాహలం నెలకొని ఉంటోందో చెప్పుకోనక్కర్లేదు.
ఈ సారి కొత్త ట్రెండ్ లో గుజరాతీ యువత..
గుజరాతీ యువత ఈ సారి ట్రెండ్ మార్చారు. సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో పాటు కొన్ని అదనపు హంగులను సమకూర్చుకుంటున్నారు. దేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 మిషన్ నమూనాను తమ వీపు మీద టాటూల రూపంలో వేయించుకుంటున్నారు. అది బాడీ పెయింట్. నవరాత్రులు ముగిసేంత వరకూ ఈ పెయింట్ చెక్కు చెదరనివ్వరట ఆ యువతులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఈ సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది అక్కడి యువత. సామాజిక అంశాలను టాటూల రూపంలో వేయించుకుంటోంది.


ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు టాటూలుగా..
నరేంద్ర మోడీ హయాంలో దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలను టాటూల రూపంలో వేయించుకుని, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒక్క చంద్రయాన్-2 మిషన్ మాత్రమే కాదు.. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు ఉదంతాన్ని టాటూలుగా వేయించుకుంటున్నారు గుజరాతీ అమ్మాయిలు. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ ను రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతంగా రూపొందించడానికి అవసరమైన ఆర్టికల్ 35 ఎ, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన చిత్రాలను కూడా తమ వీపుపై టాటూలుగా వేయించుకుంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications