వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో దిలీప్ పని ఫినిష్: పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సురేశన్, సౌమ్య కేసులో ఉరి శిక్ష వేయించారు !

నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ కు ఇప్పుడు నిజంగానే సినిమా కష్టాలు ఎదురైనాయి. దిలీప్ తో పాటు ఎవ్వరూ ఊహించలేని న్యాయవాదిని నటి లైంగిక దాడి కేసు.

|
Google Oneindia TeluguNews

కొచ్చి: నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ కు ఇప్పుడు నిజంగానే సినిమా కష్టాలు ఎదురైనాయి. దిలీప్ తో పాటు ఎవ్వరూ ఊహించలేని న్యాయవాదిని నటి లైంగిక దాడి కేసు వాదించడానికి కేరళ ప్రభుత్వం నియమించింది.

హీరో దిలీప్ భార్య కావ్య, ఆమె తల్లి ఎస్కేప్, నటి లైంగిక దాడి వీడియో, మెమెరీ కార్డు ఎక్కడ !హీరో దిలీప్ భార్య కావ్య, ఆమె తల్లి ఎస్కేప్, నటి లైంగిక దాడి వీడియో, మెమెరీ కార్డు ఎక్కడ !

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు విచారణ చెయ్యడానికి కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రముఖ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేశన్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా పబ్లిక్ ప్రాసికూటర్ సురేశన్ ను కేసు వాదించాలని సూచించారని తెలిసింది.

సౌమ్య హత్య కేసు

సౌమ్య హత్య కేసు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌమ్య హత్య కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేశన్ వాదించారు. సౌమ్య హత్య కేసులో నిందితుడు గోవిందచామికి ఉరి శిక్ష పడేవిధంగా కేసు వాదించారు. అయితే సౌమ్య హత్య కేసులో గోవిందచామికి విధించిన ఉరి శిక్షను సుప్రీం కోర్టు రద్దు చేసింది.

కేరళ ప్రజల డిమాండ్ !

కేరళ ప్రజల డిమాండ్ !

నటి లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన దిలీప్ ను జైలు నుంచి విడిపించాలని ఆయన తరపు న్యాయవాది రామ్ కూమర్ చాల ప్రయత్నాలు చేస్తున్నారు. నటి లైంగిక దాడి కేసును వాదించడానికి సీనియర్ న్యాయవాదిని నియమించాలని కేరళ ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

దిలీప్ న్యాయవాదికి సినిమా !

దిలీప్ న్యాయవాదికి సినిమా !

కేరళ ప్రభుత్వం ప్రజలు డిమాండ్ ను పరిశీలించిన తరువాత స్పెషల్ పబ్లిక్ ప్యాసిక్యూటర్ సురేశన్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నటి లైంగిక దాడి కేసు సురేశన్ వాదిస్తే దిలీప్ ను జైలు నుంచి బయటకు తీసుకురావడం ఆయన న్యాయవాది రామ్ కుమార్ కు చాల కష్టం అయ్యే అవకాశం ఉంది.

నానా తంటాలు పడాలి !

నానా తంటాలు పడాలి !

నటి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సురేశన్ ను నియమించడంతో ఇప్పుడు దిలీప్ ను జైలు నుంచి విడిపించడానికి ఆయన న్యాయవాది రామ్ కుమార్ నానా తంటాలు పడే అవకాశం ఉందని స్థానిక మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది.

కేరళకు చెందిన మరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీపీ. ఉదయభాను మరో న్యాయవాదిగా నియమించే అవకాశం ఉందని స్థానిక మీడియా అంటోంది.

ప్రముఖ వ్యాపారి జైలుకు !

ప్రముఖ వ్యాపారి జైలుకు !

కేరళలో సంచలనం సృష్టించిన చంద్రబోస్ హత్య కేసులో గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీపీ ఉదయభాను వాదించారు. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త మహమ్మద్ నిషాన్ ను జైలుకు పంపించిన కీర్తి ఉదయభానుకు ఉంది. మొత్తం మీద వీరిద్దరూ కేసు వాదిస్తే దిలీప్ పని ఫినిష్ అంటున్నారు న్యాయనిపుణులు.

English summary
Advocate A Suresan has been appointed as the Special Public Prosecutor in the actor abduction and assault case. The government issued the order in this regard late on Wednesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X