ఆర్మీ చీఫ్ నోట.. సర్జికల్ స్ట్రైక్స్ మాట: మరో రౌండ్?: పాకిస్తాన్ కు క్లియర్ కట్ వార్నింగ్
నేడు కార్గిల్ విజయ్ దివస్. దేశవ్యాప్తంగా ఈ వేడుకలను జరుపుకొంటోన్నారు. ఇది 26వ వార్షికోత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు కార్గిల్ అమర వీరులకు నివాళి అర్పించారు. వారికి జోహార్లు అర్పించారు.
కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1999లో ఇదే రోజున.. భారత సైన్యం ఆపరేషన్ విజయ్ విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించింది. టోలోలింగ్, టైగర్ హిల్ వంటి అత్యంత ఎత్తైన ప్రాంతాలలో దాదాపు మూడు నెలల పాటు జరిగిన యుద్ధం తర్వాత విజయం సాధించినట్లు తెలిపింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది.. కార్గిల్‌లోని ద్రాస్‌లో ఉన్న వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మూడు ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ ప్రజలు అమరవీరులకు ఈ-శ్రద్ధాంజలి అర్పించడానికి వీలుగా ఒక పోర్టల్‌ను ప్రారంభించారు.
1999 కార్గిల్ యుద్ధంలో జరిగిన పోరాటాల గురించి ప్రజలు వినడానికి వీలుగా ఒక QR కోడ్ ఆధారిత ఆడియో గేట్ వేనూ ప్రారంభించారు. అలాగే- ఇండస్ వ్యూ పాయింట్ అనే మరో ప్రాజెక్టును కూడా ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలు బటాలిక్ సెక్టార్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వరకు వెళ్ళే అవకాశం కలుగుతుంది.
వీటిని ప్రారంభించిన అనంతరం ఉపేంద్ర ద్వివేది మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు. పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఉగ్రవాద స్థావరాలపై సమర్థవంతంగా దాడి చేసి, పాకిస్తాన్ చొరబాట్లు, ఉగ్రవాదుల దురాక్రమణలను అడ్డుకోవడం ద్వారా నిర్ణయాత్మక విజయం సాధించామని ఆయన అన్నారు.
భారత్ శాంతికి అవకాశం ఇచ్చిందని, కానీ పాకిస్తాన్ పిరికిపందలా వ్యవహరించిందని ద్వివేది విమర్శించారు. మే 8, 9 తేదీల్లో పాకిస్తాన్ సైనిక చర్యలను సమర్థవంతంగా తిప్పి కొట్టామని అన్నారు. పాకిస్తాన్ తమపై దాడికి ప్రయత్నించినప్పటికీ- అత్యంత పటిష్ఠమైన గగనతల రక్షణ వ్యవస్థను ఛేదించడం ఆ దేశానికి సాధ్యం కాలేదని అన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారిని విడిచిపెట్టబోమనr పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చిందని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ స్ట్రైక్ చేపట్టామని పునరుద్ఘాటించారు. ఇలాంటి దాడులను చూసి బాధపడే స్థితిని దాటి.. ఎదురుదాడి చేసే స్థాయికి ఎదిగామని అన్నారు.
మనదేశ రక్షణ వ్యవస్థ ఎంత బలోపేతమైనదో ఇది నిరూపించిందని ఉపేంద్ర ద్వివేది చెప్పారు. మనదేశ సైన్యం ప్రపంచంలోనే శక్తివంతంగా ఎదుగుతోందని అన్నారు. రుద్ర బ్రిగేడ్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపానని, ఇందులో భాగంగా పదాతిదళం, మెకనైజ్డ్ ఇన్ ఫాంట్రీ, ఆర్మర్డ్ యూనిట్లు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్, మానవరహిత వైమానిక దళాలు ఒకే చోట ఉండి రవాణా, సైనిక పోరాటానికి మద్దతు అందిస్తాయని అన్నారు.
భైరవ్ లైట్ కమాండో యూనిట్‌ను ప్రత్యేక దళంగా ఏర్పాటు చేశామని, ఇది సరిహద్దులో శత్రువుపై మెరుపుదాడులు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రతి పదాతిదళ బెటాలియన్‌లో ఇప్పుడు డ్రోన్ ప్లాటూన్ ఉందని, ఆర్టిలరీలో శక్తిభాన్ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశామని, ఇది డ్రోన్, కౌంటర్-డ్రోన్ సామగ్రితో సన్నద్ధమై ఉంటుందని అన్నారు.
-
భారత్ న్యూస్ కవర్ చేసిన పాక్ ఛానెల్.. అక్కడి ప్రభుత్వం ఏం చేసిందంటే..? -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications