భర్తలపై అసంతృప్తితో ఉన్న భార్యల ప్రవర్తన ఇలాగే..
ఏ గొడవలు, పేచీలు లేని ఆలు మగల దాంపత్యం సాఫీగా సాగిపోతుంది. నిత్యం ఏదో ఒక పేచీతో తలపడే భార్య భర్తలు ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. ముఖ్యంగా మగవాళ్ల కంటే ఆడవాళ్లే త్వరగా అభద్రతా భావానికి లోనవుతారు. ఆ క్రమంలో ఆడవాళ్లు మానసికంగా తీవ్రంగా కలత చెందుతారని చెప్తోంది తాజాగా నిర్వహించిన ఓ సర్వే.
భర్తల ప్రవర్తనతో విసిగిపోయిన భార్యల మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి సోషల్ మీడియా ద్వారా సర్వే నిర్వహించింది ఒక సంస్థ. ఇందులో భాగంగా మీ భర్తపై మీకు సంతృప్తి ఉందా..? ఒకవేళ లేకపోతే కారణాలేంటి..? ఇలాంటి ప్రశ్రలపై ఆరా తీసింది సర్వే నిర్వహించిన సంస్థ. కాగా.. సర్వేలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు, ఆ ప్రశ్నలను ఎదుర్కొన్న భార్యామణులు.

భర్తల ప్రవర్తన నచ్చని భార్యలు విపరీత మనస్తత్వాన్ని కలిగి ఉంటారన్నది సర్వేలో తేలిన అంశం. అంతేకాదు..! ఇలాంటి మహిళలు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా గడపడం, రాత్రంతా దేని గురించో ఆలోచిస్తూ తెల్లవార్లు మెలుకువతో ఉండడం లాంటి లక్షణాలను కలిగి ఉంటారట. అలాగే భర్త పక్కన ఉన్న సమయంలోను ఏదో తెలియని ఒత్తిడికి లోనవుతుంటారని, ఒత్తిడిని భరించలేక ఆ కోపాన్ని భర్తలపై చూపిస్తారని దీంతో భార్య భర్తలు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని పేర్కొంది సర్వే.
అయితే.. భర్తతో గొడవలు తీవ్ర రూపం దాల్చితే కొంతమంది మహిళలు వేరే వ్యక్తులతో సంబంధాలకు ఆకర్ఫితులవుతారని, 40 శాతం అక్రమ సంబంధాలకు కారణమిదే అని తెలిపింది సర్వే.












Click it and Unblock the Notifications