Surya Grahan 2022: గర్భిణుల కోసం కీలక సూచనలు: అలా చేయడం వల్ల..!

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం తొలి తొలి సూర్యగ్రహణం శనివారం ఏర్పడబోతోంది. శని అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవించనుంది. వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. భారత్‌లో కనిపించదు. అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ- పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల ప్రజలు మాత్రమే దీన్ని చూడగలుగుతారు. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా.. తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది.

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. భారత్‌లో ఈ సూర్యగ్రహణం అర్ధరాత్రి 12:15 నిమిషాలకు ఆరంభమౌతుంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. తెల్లవారు జామున 4:07 నిమిషాలకు ముగుస్తుంది. అమెరికా దక్షిణ ప్రాంతంతో పాటు చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియా నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని

Surya Grahanam 2022: Pregnancy Precautions For Ladies In Telugu

గ్రహణ కాలంలో గర్భిణులు కొన్ని నియమాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణులు నిద్రపోకూడదని పెద్దలు చెబుతుంటారు. దీన్ని పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో కత్తుల వంటి పదునైన వస్తువులను వాడకూడదనే నియమం కూడా ఉంది. గ్రహణకాలం ఆరంభానికి ముందు.. ఆ తరువాత తప్పనిసరిగా ఆభ్యంగన స్నానం చేయాల్సి ఉంటుంది. నదీస్నానం మరింత శ్రేష్ఠమని పండితులు సలహా ఇస్తోన్నారు.

గ్రహణ సమయంలో గర్భిణులు సనాతన గోపాలమంత్రాన్ని పఠించాలి. మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం, సూర్యజపం, శివ పంచాక్షరీలను పఠించడం అత్యుత్తమం. వంట వండటం, భోజనం చేయడం, ద్రవ పదార్థాలను స్వీకరించడం మంచిది కాదు. గ్రహణ కాలం ఆరంభానికి ముందే అవన్నీ ముగించాల్సి ఉంటుంది. మళ్లీ గ్రహణాణంతరం ఆభ్యంగన స్నానం, పూజలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు.

గ్రహణ నియమాలను పాటించడానికి ముందు- ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డాక్టర్‌ సలహాలను తీసుకోవడం మంచిది. అన్నింటికంటే ముఖ్యమైనది- సూర్య కిరణాలు తమపై ప్రసరించకుండా నిలువరించుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల పుట్టబోయే బిడ్డకు గ్రహణం మొర్రి సంభవిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే- కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పండితులు సూచిస్తుంటారు. గ్రహణానంతరం దేవాలయాన్ని సందర్శించితే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+