‘నీ వక్రబుద్ధి భర్త విషయంలో ఏం చేయలేను’: సుష్మా
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కి కొంత మంది నుంచి వస్తున్న ప్రశ్నలు చికాకును తెప్పించేలా ఉన్నాయి. అయినా ఆమె చాలా ఓపిగ్గా వారికి సమాధానం చెబుతున్నారు. దేశంలోని, విదేశాల్లోని భారత ప్రజలు తమ సమస్యలను చెప్పగానే స్పందిస్తున్న సుష్మాకు ఇలాంటి వారు కొంత ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఓ వ్యక్తి తన కారు రోడ్డుపై ఆగిపోయిందని, తాను ఇప్పుడు ఏం చేయాలని సుష్మాకు ట్విట్టర్ వేదికగా సహాయం కోరాడు. అయితే, తనకు మెకానిక్ రాదని, ఎవరైనా మంచి మెకానిక్‌ను తీసుకొచ్చి కారును బాగు చేసుకోవాలని సుష్మా ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పారు.
తాజాగా, ఓ మహిళ.. సుష్మాకు వింత ప్రశ్నను సంధించారు. తన భర్త ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, అందుకు సంబంధించి కొన్ని వివరాలు తెలిపి సాయం చేయాలని సుష్మాకు ట్వీట్ చేసింది. అంతేగాక, తన భర్త థాయ్‌లాండ్‌కు చెందిన ఓ యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడని, ప్రస్తుతం ఆమె న్యూఢిల్లీలోనే ఉందని వివరించింది.

తన తల్లి అంత్యక్రియల నిమిత్తం తాను భారత్‌కు వచ్చానని, భర్త ప్రియురాలు కూడా ఇక్కడికి వచ్చిందని ట్రూకాలర్ ఐడీ ద్వారా తనకు తెలిసిందని తెలిపింది. అయితే, ఆ యువతి పేరు ఏంటన్నది తెలుసుకోలేక పోయానని, మీ సాయం కావాలని కేంద్రమంత్రి సుష్మాను కోరింది.
ఇందుకు సుష్మా ఎంతో సహనంగా సమాధానం ఇచ్చారు. 'ఈ విషయంలో తాను నిస్సాహాయురాలిని' అని సుష్మా తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల విషయంలో, పాస్ పోర్ట్, వీసా సమస్యలు లాంటి అధికారిక అంశాల్లో మాత్రమే తాను సహాయం చేయగలనని స్పష్టం చేశారు.
'సుజాత.. నీ మీద జాలి మాత్రమే చూపించగలను. విదేశాల్లో ఉండే మనవాళ్ల సమస్యలపై స్పందించి వారికి సాయం చేయగలను కానీ, ఇలాంటి వక్రబుద్ధిగల భర్తల విషయంలో తాను సాయం చేయలేను' అని సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా ఆమెకు బదులిచ్చారు.
Sujatha - All my sympathies are with you. Unfortunately, I have no power to punish or reform such errant husbands. @SujathaSuukri
— Sushma Swaraj (@SushmaSwaraj) 31 August 2016












Click it and Unblock the Notifications