టీకి కట్టుబడి ఉన్నాం: సుష్మా, దుష్ప్రచారం: నాగం

దాంతో సుష్మా స్వరాజ్ శుక్రవారం ట్విట్టర్‌లో తెలంగాణపై స్పందించారు.. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆమె స్పప్టం చేశారు. కాగా, బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలిశారు. తెలంగాణపై యూ టర్న్ తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన తెలంగాణకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.
తెలంగాణ విషయంలో తమ పార్టీ వైఖరిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణకు చెందిన బిజెపి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తాను ఢిల్లీ నుంచి తిరిగి వెళ్తానని ఆయన చెప్పారు. తెలంగాణ కలను సాకారం చేసుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని, సీమాంధ్ర సమస్యలను యుపిఎ ప్రభుత్వం పరిష్కరించకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications