మోడీకంటే బెస్ట్: డిగ్గీ, రాహుల్‌కంటే మీరని సుష్మా ట్వీట్

దిగ్విజయ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ... సుష్మా స్వరాజ్ ప్రధాని అభ్యర్థిగా బెట్టర్ అని అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కంటే సుష్మా మంచి అభ్యర్థి అన్నారు. బిజెపి తన పార్టీ ప్రధాని అభ్యర్థిగా మంచి లీడర్ అయినా సుష్మా వంటి వారిని ఎందుకు ఎన్నుకోలేదన్నారు.
ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేసి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కన్నా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మిన్న అంటూ సుష్మా ట్విటర్‌లో స్పందించారు. రాహుల్ గాంధీతో పోలిస్తే తన దృష్టిలో దిగ్విజయ్ మేలైన అభ్యర్థి అనిపిస్తోందన్నారు.
కాగా, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఎంపికయ్యారు. కాంగ్రెసు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయన పేరే ఖరారు అయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications