గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: ఎంపిలకు సుష్మా

Sushma Swaraj promises to help gulf victims
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో కష్టాలు పడుతున్న బాధితులను ఆదుకుంటామని కేంద్ర విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలతో ఆమె భేటీ అయ్యారు. బాధితులను స్వయంగా కలిస్తే వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకోవచ్చునని ఈ సందర్భంగా ఎంపీలు ఆమెకు సూచించారు.

గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సాగిన చర్చలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్‌తోపాటు కార్యదర్శి ప్రేమ్ నారాయణ్ కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు లోక్‌సభ సభ్యులతోపాటు కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.

నైపుణ్యం గల కార్మికులు అధికారిక వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తుండటంతో నైపుణ్యం లేని వారు కూడా ఆశపడి, ఏజెంట్ల మోసాలకు బలవుతున్నారని వారు మంత్రికి వివరించారు. ఈ దుస్థితిని నివారించేందుకు విదేశాంగ శాఖతోపాటు కార్మిక శాఖలు సంయుక్తంగా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

కేరళ మినహా గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్నవారిలో అత్యధికులు తెలుగువారేనని, 1.04 లక్షల మంది తెలుగు కార్మికులు గల్ఫ్‌లో ఉన్నారని తెలిపారు. వీరిలో టెన్త్, ఆలోపు చదివినవారు 74 శాతం కాగా, నిరక్షరాస్యులు 24 శాతమని వివరించారు. తెలుగు కార్మికులలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు 90 శాతంగా ఉన్నట్లు చెప్పారు. వీరిని ఆదుకునేందుకు కేంద్రం రూ.2 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని అంశాలపైనా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. అలాగే గల్ఫ్‌కు ప్రతినిధి బృందాన్ని పంపడాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+