భర్తతో స్నేహితురాలు సన్నిహితంగా ఉంటుందని భార్య ఏం చేసిందంటే

జైపూర్ :అనుమానం పెనుభూతమైంది. చిన్ననాటి స్నేహితురాళ్ళ మద్య అనుమానం పెనుశాపంగా మారింది. భర్తతో తన స్నేహితులరాలు సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక స్నేహితురాలిని పథకం ప్రకారం హాత్యచేసి, ప్రమాదవశాత్తు చనిపోయిందని కట్టుకథ అల్లింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొంది.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బబిత, మనీషా లు బాల్య స్నేహితులు. ఆర్మీలో పనిచేసే అజయ్ తో మనీషా వివాహాం జరిగింది. అజయ్ తో తన చిన్ననాటి స్నేహితురాలు బబిత సన్నిహితంగా మెలగడంతో మనీషా అనుమానం పెంచుకొంది. తన భర్తతో బబితకు వివాహేతర సంబందం ఉందని అనుమానించింది. గంటల కొద్ది తన భర్త బబితతో పోన్ లో మాట్లాడడం కూడ ఆమె అనుమానాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ అనుమానంతో బబితను అంతం చేయాలని మనీషా ప్లాన్ చేసింది.

suspect illegal affair:wife murder her friend

పథకం ప్రకారం హత్య

పథకం ప్రకారం తన స్నేహితురాలిని హత్య చేయాలని మనీషా నిర్ణయించుకొంది. అయితే ప్రమాదవశాత్తు బబిత మరణించిందని అందరినీ నమ్మించాలని పథకం వేసింది. తన పథకాన్ని అమలుచేసేందుకు ముహుర్తాన్ని నిర్ణయించుకొంది.ఈ మేరకు తన భర్త అజయ్ వస్తున్నాడని అతన్ని తీసుకువచ్చేందుకు వెళ్ళేందుకు తనకు తోడుగా రావాలని స్నేహితురాలు బబితను మనీషా కోరింది. స్నేహితురాలు అడగ్గానే ఆమె ఒప్పుకొంది.

బబితను రతన్ ఘర్ సమీపంలోని చర్న్ వాసి బస్టాండ్ కు తీసుకెళ్ళింది. అజయ్ వచ్చేందుకు ఇంకా సమయం పడుతోందని నమ్మించింది.బస్టాండ్ సమీపంలోని చెరువు వద్ద కాలక్షేపం చేసేందుకు బబితను తీసుకెళ్ళింది.తన చేతికి ఉన్న ఉంగరాన్ని మనీషా చెరువులోకి విసిరేసింది. పొరపాటున ఉంగరం చెరువులో పడినట్టుగా బబితను నమ్మించింది. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది. నిశ్చితార్థం రోజున అజయ్ తొడిగిన ఉంగరంగా బబితను నమ్మించింది.

ఉంగరాన్ని తెచ్చేందుకు బబిత చెరువులోకి దిగింది. ఉంగరం తీసుకొని వస్తుండగా ఆమెను చెరువ నుండి బయటకు రాకుండా అడ్డుకొంది. చెరువలోనే బబిత ప్రాణాలు విడిచింది.బబిత ప్రమాదవశాత్తు మరణించిందని నమ్మించింది. అయితే కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో బబిత ప్రమాదశాత్తు మరణించలేదని హాత్యగా నిర్థారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+