సంబంధం: రెండో భార్య తల నరికి, బ్యాగ్‌లో పెట్టాడు, పీఎస్‌లో ఆమె తలకు ముద్దులు

కోలార్: అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త తన భార్య తల నిరికి, దానిని బ్యాగ్‌లో పెట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అనంతరం స్టేషన్లో పలుమార్లు తన భార్యకు ముద్దులు ఇచ్చాడు. ఈ సంఘటన గురువారం నాడు కోలార్‌లో జరిగింది.

అజీజ్ సద్దామ్ (26) తన భార్య రోషిని ఖనమ్ (22)ను హత్య చేసాడు. ఈమె అతని రెండో భార్య. సద్దామ్... గఫర్ ఖాన్ మొహల్లాలో ఉంటున్నాడు. రెండో భార్య బెంగళూరులోని నీలసంద్రలో ఉంటోంది.

Suspecting fidelity, man beheads wife

గురువారం సద్దాం తన రెండో భార్య రోషినిని తన మామిడి తోటకు పిలిచాడు. ఈ మామిడి తోడ చింతమని తాలుకాలోని గొల్లహళ్లి సమీపంలో ఉంది. వివాహేతర సంబంధంపై మాట్లాడేందుకు పిలిచాడు. ఆమె వచ్చాక మత్తు కలిపిన జ్యూస్ ఇచ్చాడు.

అనంతరం ఆమె తలను నరికాడు. ఆమె శరీరాన్ని పొలంలోనే పడేశాడు. తర్వాత ఆమె తలను బ్యాగ్‌లో పెట్టుకొని, శ్రీనివాసపురం వచ్చాడు. నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లాడు. అక్కడ బ్యాగ్ తెరిచి, తన భార్య తలను బయటకు తీసి, ఆమెకు పదేపదే ముద్దులు ఇవ్వడం ప్రారంభించాడు.

సద్దాం తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అజీజ్ సద్దాంకు అప్పటికే ఓ పెళ్లయిందని తేలింది. అంతకుముందు మూడు వారాల క్రితం చిక్కమంగలూరు జిల్లాలోలని అజంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోను ఇలాంటి సంఘటన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+