కారులో భర్త, మరో మహిళ: అఫైర్ ఉందని భార్య నడిరోడ్డుపై రచ్చ రచ్చ (వీడియో)

దేశ వాణిజ్య రాజధాని ముంబై పెడెర్ రోడ్డులో ఓ వివాహిత హల్ చల్ చేశారు. నడిరోడ్డుపై తన భర్త రెంజ్ రోవర్ కారు ఆపారు. కారు ఛేజ్ చేసి మరీ హంగామా చేశారు. అయితే అతని కారులో మరో మహిళ ఉండటమే.. అతనికి ఆమెతో వివాహేతర సంబంధం ఉంది అని భావించారు. నడిరోడ్డుపై కారు ఆపడంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. శనివారం ఈ ఘటన జరగగా.. వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

తన భర్తతో ఉన్న మహిళతో అఫైర్ ఉంది అని భావించి కారును నడిరోడ్డుపై ఆపింది. కారు అద్దం తీసి కొట్టే ప్రయత్నం చేసింది. వెహికిల్ ముందుకు తీసుకొని పోనియగా.. ముందుకెళ్లి అడ్డుకున్నారు. బ్యానెట్ పైకి ఎక్కి మరీ.. బీభత్సం సృష్టించారు. ఆ మహిళను అద్దంపైనుంచే చెప్పుతో కొట్టింది. తర్వాత కారును పోనియగా.. ఆ రెండు వాహనాలను స్టేషన్ తీసుకెళ్లారు.

Suspecting husband of having an affair, woman blocks his car on road..

కారు నడిరోడ్డుపై ఆపినందున మహిళకు ఫైన్ వేశారు. అయితే వారిలో ఒకరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఫైన్ కట్టిన తర్వాత వారిని గామ్ దేవి పోలీసులు వదిలేయడంతో వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+