Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్విస్టుల మీద ట్విస్టులతో "ఫ్యామిలీ మర్డర్స్".. అత్యంత దారుణంగా హత్యలు !

థ్రిల్లర్ సినిమాని మించిన ట్విస్ట్ లతో.. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న హత్యల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదట తండ్రి హత్యకేసులో చిన్న కుమారుడు అరెస్ట్ అవ్వగా.. అందుకు పగా తీర్చుకున్నాడు పెద్ద కుమారుడు. తమ్ముడిని హత్య చేయించి.. అంత్యక్రియల్లో కన్నీళ్లు కార్చి.. మూడు రోజుల్లో దేశం విడిచిపోయాడు ఓ అన్న. ఈ రివెంజ్ మర్డర్ మిస్టరీని చేధించిన పోలీసులకు సైతం ఈ ఊహించని ట్విస్ట్ లు భారీ షాక్ ఇచ్చాయి.

అసలు ఏం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో 2017లో రిటైర్డ్ పోలీస్ అధికారి హనుమాన్ సింగ్ తోమర్ హత్యకు గురయ్యారు. దాడిలో ఆయన చిన్న కుమారుడు అజయ్ తోమర్ తప్పించుకున్నారు. కాగా సంబంధిత ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. ఆయన చిన్న కుమారుడే ప్రధాన నిందితుడని తేలింది. దీంతో న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు శిక్ష పడింది.

suspence-thrilling-family-murders-issue-in-madhya-pradesh-got-viral

ఏడేళ్ల తర్వాత ప్రతీకారం..

అజయ్ జైల్లో ఉండగానే.. అతని అన్న భాను తోమర్ తండ్రి హత్యకు కారణమైన తమ్ముడిపై పగ పెంచుకున్నాడు. 2025 జూలైలో అజయ్‌ పెరోల్‌పై విడుదల కాగానే.. భాను తన ప్లాన్ అమలులోకి తెచ్చాడు. ఈ క్రమంలోనే తన బంధువు మోనేశ్, మరో 17 ఏళ్ల బాలికకు అజయ్‌ను చంపేందుకు సుపారీ ఇచ్చాడు.

పథకం ప్రకారం బాలికను అజయ్‌తో కారులో పంపి.. శివపురి-గ్వాలియర్ హైవేపై ఓ పెట్రోల్ బంక్ వద్ద కారు ఆపమని చెప్పించారు. అజయ్ కారు ఆపగానే.. అప్పటికే అక్కడ ఎదురు చూసిన కిరాయి హంతకులు ఆయనపై కాల్పులు జరిపి హతమార్చారు.

ఆ తర్వాత తమ్ముడి అంత్యక్రియల్లో సైతం భాను పాల్గొన్నాడు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 500కు పైగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. హత్యకు వాడిన కారును ట్రేస్ చేయగా... అది భాను పేరుతో రిజిస్టర్ అయి ఉండటంతో కేసు మలుపు తిప్పింది. ఈ ఆధారంతో భాను పాత్ర వెలుగులోకి వచ్చింది. దాంతో మోనేశ్, మైనర్ బాలికను అరెస్టు చేసి.. హత్యకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

suspence-thrilling-family-murders-issue-in-madhya-pradesh-got-viral

ఇక భాను తోమర్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఇప్పటికే లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ, పాస్‌పోర్ట్ రద్దు ప్రక్రియను మొదలుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇది కుటుంబ కలహాల కారణంగా జరిగిన దారుణ హత్య" అని శివపురి ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+